Medha Dakshinamurthy Stotram in Telugu | శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రం

YouTube Subscribe
Please share it
Rate this post

Medha Dakshinamurthy Stotram in Telugu

Medha Dakshinamurthy Stotram is a special prayer that people say to ask for help in learning and understanding things. It’s like when we have a hard time with our schoolwork or trying to do something new, we can say this prayer and ask for wisdom and knowledge to make it easier. It’s like talking to someone really wise who can give us good ideas and help us learn better.

శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రం

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరంతి త్రయశ్శిఖాః |
తస్మైతారాత్మనే మేధాదక్షిణామూర్తయే నమః || ౧ ||

నత్వా యం మునయస్సర్వే పరంయాంతి దురాసదమ్ |
నకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨ ||

మోహజాలవినిర్ముక్తో బ్రహ్మవిద్యాతి యత్పదమ్ |
మోకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౩ ||

భవమాశ్రిత్యయం విద్వాన్ నభవోహ్యభవత్పరః |
భకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౪ ||

గగనాకారవద్భాంతమనుభాత్యఖిలం జగత్ |
గకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౫ ||

వటమూలనివాసో యో లోకానాం ప్రభురవ్యయః |
వకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౬ ||

తేజోభిర్యస్యసూర్యోఽసౌ కాలక్లృప్తికరో భవేత్ |
తేకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౭ ||

దక్షత్రిపురసంహారే యః కాలవిషభంజనే |
దకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౮ ||

క్షిప్రం భవతి వాక్సిద్ధిర్యన్నామస్మరణాన్నృణామ్ |
క్షికారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౯ ||

ణాకారవాచ్యోయస్సుప్తం సందీపయతి మే మనః |
ణాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౦ ||

మూర్తయో హ్యష్టధాయస్య జగజ్జన్మాదికారణం |
మూకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౧ ||

తత్త్వం బ్రహ్మాసి పరమమితి యద్గురుబోధితః |
సరేఫతాత్మనే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౨ ||

యేయం విదిత్వా బ్రహ్మాద్యా ఋషయో యాంతి నిర్వృతిమ్ |
యేకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౩ ||

మహతాం దేవమిత్యాహుర్నిగమాగమయోశ్శివః |
మకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౪ ||

సర్వస్యజగతో హ్యంతర్బహిర్యో వ్యాప్యసంస్థితః |
హ్యకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౫ ||

త్వమేవ జగతస్సాక్షీ సృష్టిస్థిత్యంతకారణం |
మేకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౬ ||

ధామేతి ధాతృసృష్టేర్యత్కారణం కార్యముచ్యతే |
ధాంకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౭ ||

ప్రకృతేర్యత్పరం ధ్యాత్వా తాదాత్మ్యం యాతి వై మునిః |
ప్రకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౮ ||

జ్ఞానినోయముపాస్యంతి తత్త్వాతీతం చిదాత్మకమ్ |
జ్ఞాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౧౯ ||

ప్రజ్ఞా సంజాయతే యస్య ధ్యాననామార్చనాదిభిః |
ప్రకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨౦ ||

యస్య స్మరణమాత్రేణ సరోముక్తస్సబంధనాత్ |
యకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨౧ ||

ఛవేర్యన్నేంద్రియాణ్యాపుర్విషయేష్విహ జాడ్యతామ్ |
ఛకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨౨ ||

స్వాంతేవిదాం జడానాం యో దూరేతిష్ఠతి చిన్మయః |
స్వాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨౩ ||

హారప్రాయఫణీంద్రాయ సర్వవిద్యాప్రదాయినే |
హాకారరూపిణే మేధాదక్షిణామూర్తయే నమః || ౨౪ ||

ఇతి శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్రవర్ణపద స్తుతిః ||

Also read :శ్రీ మంగళ గౌరీ స్తోత్రం 

Please share it

Leave a Comment