Mruthyunjaya Ashtottara Shatanamavali in Telugu
Mruthyunjaya Ashtottara Shatanamavali holds great significance in Hindu culture and spirituality. It is a sacred hymn that is dedicated to Lord Shiva, who is considered the supreme deity of destruction and transformation. The name “Mruthyunjaya” means the conqueror of death, and thus this hymn is chanted to seek protection from illness, suffering, and even death itself. It is believed that by reciting each of the 108 names of Lord Shiva mentioned in the Ashtottara Shatanamavali, one can attain a state of inner peace, healing, and rejuvenation. The chanting of these names not only brings physical and mental well-being but also aids the seeker in overcoming their fears and obstacles in life. Thus, the Mruthyunjaya Ashtottara Shatanamavali is revered and practiced by many devotees, as it is considered a powerful spiritual practice that invokes Lord Shiva’s blessings and divine grace.
శ్రీ మృత్యుంజయ అష్టోత్తరశతనామావళిః
ఓం భగవతే నమః
ఓం సదాశివాయ నమః
ఓం సకలతత్త్వాత్మకాయ నమః
ఓం సర్వమంత్రరూపాయ నమః
ఓం సర్వయంత్రాధిష్ఠితాయ నమః
ఓం తంత్రస్వరూపాయ నమః
ఓం తత్త్వవిదూరాయ నమః
ఓం బ్రహ్మరుద్రావతారిణే నమః
ఓం నీలకంఠాయ నమః || 9 ||
ఓం పార్వతీప్రియాయ నమః
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
ఓం భస్మోద్ధూలితవిగ్రహాయ నమః
ఓం మహామణిమకుటధారణాయ నమః
ఓం మాణిక్యభూషణాయ నమః
ఓం సృష్టిస్థితిప్రలయకాలరౌద్రావతారాయ నమః
ఓం దక్షాధ్వరధ్వంసకాయ నమః
ఓం మహాకాలభేదకాయ నమః
ఓం మూలాధారైకనిలయాయ నమః || 16 ||
ఓం తత్త్వాతీతాయ నమః
ఓం గంగాధరాయ నమః 20
ఓం సర్వదేవాధిదేవాయ నమః
ఓం వేదాంతసారాయ నమః
ఓం త్రివర్గసాధనాయ నమః
ఓం అనేకకోటిబ్రహ్మాండనాయకాయ నమః
ఓం అనంతాదినాగకులభూషణాయ నమః
ఓం ప్రణవస్వరూపాయ నమః
ఓం చిదాకాశాయ నమః || 27 ||
ఓం ఆకాశాదిస్వరూపాయ నమః
ఓం గ్రహనక్షత్రమాలినే నమః
ఓం సకలాయ నమః
ఓం కలంకరహితాయ నమః
ఓం సకలలోకైకకర్త్రే నమః
ఓం సకలలోకైకభర్త్రే నమః
ఓం సకలలోకైకసంహర్త్రే నమః
ఓం సకలనిగమగుహ్యాయ నమః
ఓం సకలవేదాంతపారగాయ నమః || 36 ||
ఓం సకలలోకైకవరప్రదాయ నమః
ఓం సకలలోకైకశంకరాయ నమః
ఓం శశాంకశేఖరాయ నమః
ఓం శాశ్వతనిజావాసాయ నమః
ఓం నిరాభాసాయ నమః
ఓం నిరామయాయ నమః
ఓం నిర్లోభాయ నమః
ఓం నిర్మోహాయ నమః
ఓం నిర్మదాయ నమః || 45 ||
ఓం నిశ్చింతాయ నమః
ఓం నిరహంకారాయ నమః
ఓం నిరాకులాయ నమః
ఓం నిష్కలంకాయ నమః
ఓం నిర్గుణాయ నమః
ఓం నిష్కామాయ నమః
ఓం నిరుపప్లవాయ నమః
ఓం నిరవద్యాయ నమః
ఓం నిరంతరాయ నమః || 54 ||
ఓం నిష్కారణాయ నమః
ఓం నిరాతంకాయ నమః
ఓం నిష్ప్రపంచాయ నమః
ఓం నిస్సంగాయ నమః
ఓం నిర్ద్వంద్వాయ నమః
ఓం నిరాధారాయ నమః
ఓం నిరోగాయ నమః
ఓం నిష్క్రోధాయ నమః
ఓం నిర్గమాయ నమః || 63 ||
ఓం నిర్భయాయ నమః
ఓం నిర్వికల్పాయ నమః
ఓం నిర్భేదాయ నమః
ఓం నిష్క్రియాయ నమః
ఓం నిస్తులాయ నమః
ఓం నిస్సంశయాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం నిరుపమవిభవాయ నమః
ఓం నిత్యశుద్ధబుద్ధపరిపూర్ణాయ నమః || 72 ||
ఓం నిత్యాయ నమః
ఓం శుద్ధాయ నమః
ఓం బుద్ధాయ నమః
ఓం పరిపూర్ణాయ నమః
ఓం సచ్చిదానందాయ నమః
ఓం అదృశ్యాయ నమః
ఓం పరమశాంతస్వరూపాయ నమః
ఓం తేజోరూపాయ నమః
ఓం తేజోమయాయ నమః || 81 ||
ఓం మహారౌద్రాయ నమః
ఓం భద్రావతారయ నమః
ఓం మహాభైరవాయ నమః
ఓం కల్పాంతకాయ నమః
ఓం కపాలమాలాధరాయ నమః
ఓం ఖట్వాంగాయ నమః
ఓం ఖడ్గపాశాంకుశధరాయ నమః
ఓం డమరుత్రిశూలచాపధరాయ నమః
ఓం బాణగదాశక్తిబిండిపాలధరాయ నమః || 90 ||
ఓం తోమరముసలముద్గరధరాయ నమః
ఓం పట్టిశపరశుపరిఘాధరాయ నమః
ఓం భుశుండిచితాగ్నిచక్రాద్యయుధధరాయ నమః
ఓం భీషణకారసహస్రముఖాయ నమః
ఓం వికటాట్టహాసవిస్ఫారితాయ నమః
ఓం బ్రహ్మాండమండలాయ నమః
ఓం నాగేంద్రకుండలాయ నమః
ఓం నాగేంద్రహారాయ నమః
ఓం నాగేంద్రవలయాయ నమః || 99 ||
ఓం నాగేంద్రచర్మధరాయ నమః
ఓం నాగేంద్రాభరణాయ నమః
ఓం త్ర్యంబకాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం విశ్వతోముఖాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః || 108 ||
ఇతి శ్రీ మృత్యుంజయ అష్టోత్తరశతనామావళిః
Also read : ఆదిత్య హృదయం