Mukkoti Ekadasi in telugu – వైకుంఠ ఏకాదశి 2022

YouTube Subscribe
Please share it
5/5 - (1 vote)

Mukkoti Ekadasi – వైకుంఠ ఏకాదశి

                         సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. నెలకు రెండు పక్షాలు వస్తాయి1.శుక్లపక్షము 2.కృష్ణపక్షం.పక్షానికి  ఏకాదశి చొప్పున ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి, ప్రతి నెల అమావాస్య పౌర్ణమి కి ముందు ఈ ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ప్రతి నెలలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని శుద్ధ ఏకాదశి అని అంటాం. మొత్తం సంవత్సరంలో శుద్ధ ఏకాదశులు ఇలాంటివి 12 వస్తాయి.ఈనెల అమావాస్య కు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అని అంటాం. సంవత్సర కాలంలో ఇలాంటి బహుళ ఏకాదశిలు 12 వస్తాయి . వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత ఉన్నది అయినప్పటికీ నాలుగు ఏకాదశులను విశేషదాయకంగా పరిగణిస్తాము.

  • 1. ఆషాడ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి/శయనేకాదశ  
  • 2. కార్తీక శుద్ధ ఏకాదశి
  • 3. పుష్య శుద్ధ ఏకాదశి ( వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి)
  • 4.  మాఘ శుద్ధ ఏకాదశి ( భీష్మ ఏకాదశి)

mukkoti ekadasi

     తొలి ఏకాదశి నాడు పాలకడలిలో శయనించి యోగనిద్రలో గడిపి, కార్తీక శుద్ధ ఏకాదశినాడు యోగనిద్రను నుండి మేల్కొన్నాడు శ్రీమహావిష్ణువు.

దీని వెనక ఒక ఆసక్తికరమైనవంటి పురాణగాథ ఉంది. రావణాసురుడి బాధలను తాళలేని దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు అప్పుడాయన ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున దేవతలందరితో వైకుంఠం చేరుకుంటాడు అంతా కలిసి శ్రీమహావిష్ణువుని వేదములు సూక్తము లతో పరిపరివిధాలుగా స్తుతించారు. అంతట శ్రీమహావిష్ణువు ప్రీతి చెంది తన దర్శన భాగ్యాన్ని కలుగ జేశాడు.  

                         వైకుంఠ ఏకాదశి వెనుక మరో పురాణగాథ కూడా ఉంది. పూర్వం మధుకైటభులు అను రాక్షసులు విష్ణుభగవానుడు సంహరించినప్పుడు వారు  దివ్య జ్ఞానమును పొంది ఆ స్వామిని కొనియాడారు. బ్రహ్మాదులు ఎవరైనా నీ లోకం వంటి మందిరం నిర్మించి ఏకాదశి పండుగ చేసుకుని, నిన్ను నమస్కరించుకుని పూజించి ఉత్తర ద్వార మార్గమున నిన్ను చేరుకుంటారో, వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేటట్లు వరమివ్వమని ప్రార్థించారు. ప్రతి మాసం లోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి అయితే ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి గా కీర్తించబడినది.  ఈ రోజున సకల దేవతా ఆరాధ్యుడైనటువంటి ఆ శ్రీమహావిష్ణువును అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వారికి పుణ్య ఫలం దక్కుతుంది. ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఆనాడు ఉదయమే నిద్రలేచి కాలకృత్యాలు ,నిత్యకర్మలు పూర్తి చసుకుని మందిరానికి వెళ్లి తాను వ్రతము ఆచరించుటకు నిర్ణయించుకున్నట్లు ఆ వ్రతం నిర్విఘ్నంగా కొనసాగ చూడమని శ్రీహరి ప్రార్థించాలి. ఆ రోజంతా ఉపవాసముండి శ్రీహరి ధ్యానిస్తూ ఆ రోజు రాత్రి జాగరణ చేయాలి.ఈ సమయంలో శ్రీహరిని ధ్యానం చేయడం కానీ పురాణ పఠనం కానీ చేస్తే చాలా మంచిది. అలాగే అష్టాక్షరీ మంత్రాన్ని అనగా ” ఓం నమో నారాయణాయ” జపించడం చాలా మంచిది. మరునాడు ఉదయం ద్వాదశి ఘడియలు ఉండగా నారాయణుడిని పూజించి నైవేద్యం సమర్పించి భోజనం చేయవలెను. అనగా ఉపవాసం ఉండడం ఈనాటి ప్రధాన నియమం. అయితే సంతానం గలవారు ఏమీ తినకుండా ఉండకూడదు. సంతాన హీనులు. విధవలు ,సన్యాసులు మినహా మిగిలిన వారందరూ పండ్లు, పాలు వంటివి స్వీకరించవలెను. భార్యాభర్తలు ఇరువురూ కలిసి ఈ వ్రతం ఆచరించడం ఎంతో మంచిది. ఎవరైతే ద్వాదశినాడు అన్న దానం చేస్తారో అత్యున్నత ఫలితాలు ఉంటాయని పద్మపురాణం చెబుతోంది. అంతే కాదు సుమా ఎవరైతే ఏకాదశినాడు ఉపవాసము ఉండరో. మహాపాపములు పొందుతారని పురాణాలు వెల్లడిస్తున్నాయి. అయితే అనారోగ్య రిత్యా ఉపవాసం ఉండలేని వారికి వాయు పురాణం ప్రత్యామ్నాయ మార్గాలను సూచించింది. ఉపవాసం చేయలేనప్పుడు వాయు భక్షణం. అది చేతగాని సమయంలో పంచగవ్యం, అంటే పాలు నీరు నెయ్యి నువ్వులు పండ్లు తినవచ్చు. అది కూడా సాధ్యం కానప్పుడు ఉడకని పదార్ధములు,… అలా కూడా ఉపాసించే లేని వారు ఒక పొద్దు అంటే ఒక పూట ఆహారం స్వీకరించవచ్చు అని దీని అర్థం.ఇలా ఉపవాస వ్రతం పాటించడంవల్ల అశ్వమేధయాగం చేసిన ఫలితం కంటే అధిక ఫలితం లభిస్తుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి.

వైకుంఠ ద్వార దర్శనం :–   

                         దేవతలు రాక్షసుల బాధలు భరించలేక బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమబాధలను విన్నవించుకున్నారు. దీనితో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలేస్తాడు. ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను. దివి నుండి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశి ఈ పర్వదినం ప్రాముఖ్యం సంతరించుకుంది. 

                        ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు, వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి సకల శుభ ఫలితాలు కలుగుతాయి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం, అందులో దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములు అందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు స్వర్గలోకానికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఎవరైనా ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును షోడశోపచార విధులతో పూజించాలి. నిష్ఠతో దీక్షను చేసి రాత్రి జాగరణ చేయాలి ద్వాదశి రోజున మళ్లీ భగవంతుని ఆరాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఈ రోజున గోవింద నామ స్మరణం చేస్తూ నిష్ఠతో పూజ చేసిన వారికి పునర్జన్మ ఉండదు.

ఉత్తర ద్వార దర్శనం వలన కలుగు పలితాలు :

ఎ  క్రొత్త పని మొదలు పెట్టినా ముక్కోటి ఏకాదశి నుంచి చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని నిష్టగా ఆచరించడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. వైవాహిక జీవితంలో ఉండు ఆటంకాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులే కాదు 3 కోట్ల మంది దేవతలు తహతహలాడతారు అని చెబుతారు. ముక్కోటి ఏకాదశి దాటి విధివిధానాలను ఏకాదశి వ్రత నియమాలను పాటించిన వారికి స్వర్గ సుఖ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం కారణంగా దీనికి సౌఖ్య ఏకాదశి గా పేరు పొందింది. అందరూ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని శుభ ఫలితాలను పొందండి.

(Mukkoti Ekadasi) ఏకాదశి వ్రత నియమాలు ;-

1. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.

2. స్త్రీ సాంగత్యం పనికి రాదు.

3. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.

4. అన్నదానం చేయాలి.

5. దుష్ట ఆలోచనలు చేయకూడదు.

ఇవి కూడా చదవండి : సుబ్రహ్మణ్య షష్ఠి

                                        దేవి ఖడ్గమాలా స్తోత్రం

                                        కార్తీక సోమవార వ్రతం          

ఈనెల 13వ తేదీ అనగా జనవరి 13 2022 న ముక్కోటి ఏకాదశి . ఈ రోజు కనుక మీ ఇంట్లో రావి ఆకులతో ఇలా కనుక చేశారంటే ఆ  లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి . అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం.

శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ఒక్క ఏకాదశి రోజే ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశులు మనం ఉపవాసం ఉన్నా ఫలితం కలుగుతుంది. ఏ ఏకాదశి ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు ముక్కోటి ఏకాదశి రోజున తప్పక ఉపవాసం ఉండాలి. ఈరోజు అన్నాన్ని స్వీకరించకూడదు. పండ్లు పండ్ల రసాలు పాలు మాత్రమే తీసుకోవచ్చును.

శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతుడై గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని వైకుంఠం లో ఉత్తర ద్వారం దగ్గరకు వస్తారు అప్పుడు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు భక్తులు లక్ష్మీనారాయణ లను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు ఇలా ఆరాధించటం లో దీపారాధన ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కొంత మంది తెలియక ఈ రోజు ఈ చిన్న పొరపాటు చేయటం వల్ల ఫలితం శూన్యం గా ఉంటుంది. చాలా మందికి తెలియక దీపారాధనను అలాగే భూమిపై వెలిగిస్తారు అలా నేలపై వెలిగించ కుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు కనక దీపారాధన చేసే సమయంలో ఆలయంలో రావి ఆకులను పై ప్రమిదలు ఉంచి దీపారాధన చేయటం వల్ల కలిగే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు .

రావి చెట్టు అంటే శ్రీ మహా విష్ణువు కి ఎంతో ప్రీతిపాత్రమైనది అందుకే రావి చెట్టు ఆకుల మీద మీరు దీపారాధన కుందులు ఉంచి లేదా ప్రమిదలు ఉంచి దీపారాధన చేసినట్లయితే  శ్రీమహావిష్ణు అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలా గే త్రిమూర్తి స్వరూపం రవిచెట్టు అని మన పురాణాలు చెబుతున్నాయి. త్రిమూర్తుల అనుగ్రహం కలగాలని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలంటే ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు రావి చెట్టు ఆకుల మీద ప్రమిదలు ఉంచి ఇంట్లో దీపారాధన చేయాలి .ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి . దీపారాధన ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఈ విధంగా మీరు రావి చెట్టు ఆకుల పై దీపారాధన చేస్తున్న సమయంలో రావి చెట్టు ఆకు మనం తుంచే వైపు అంటే కాడ అనేది భగవంతుని ఫోటో వైపు ఉంచాలి.  ఈ ఆకు చివరి భాగం మన వైపు ఉండాలి. రావి చెట్టు ఆకు పై ప్రమిదలు ఉంచి దీపారాధన చేయాలి.

  రోజు ఇలా చేస్తే రాహు కేతు దోషాలు తొలగిపోతాయి శని బాధలు తొలగిపోతాయి.నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు .కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రార్థించి సకల దోషాలు తొలగిపోవాలంటే ఇలా రావి ఆకు ను కింద దానిపై ప్రమిద నుంచి దీపారాధన చేయాలి

 రావి చెట్లు ప్రతి ఊర్లో ఉంటాయి . వృక్షాలు అన్నిటిలో రావిచెట్టు పరమ పవిత్రమైనదిగా శ్రీమద్భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. పరమ పవిత్రమైన రావి చెట్టు కింద పరమభక్తుడైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవడానికి ఇష్టపడతారు . రావి చెట్టు విష్ణు నివాసం గా పురాణాలు చెబుతున్నాయి. ఎవరైతే రావి చెట్టు మొదల్లో నీరు పోసి ప్రదక్షిణం చేసి నమస్కరించటం వల్ల భగవంతుని సేవించిన పుణ్యం లభిస్తుంది ఆయుష్షు పెరుగుతుంది పాపాలు అన్ని తొలగిపోతాయి. మోక్షం కలుగుతుంది. రావి చెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా మా ఊర్లో అందరూ ఆరోగ్యంతో  జీవిస్తారు. ఎందుకంటే రావి చెట్టు నుండి ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావిచెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి .అంతే కాదు రావి చెట్టు నుండి వీచే గాలి కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన నఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది.కుటుంబంలో ఆపద వచ్చినా ఆర్థికపరంగా వడిదుడుకులు వచ్చినా  వాటిని తొలగించుకోవాలంటే రావి  చెట్టు ఆకులతో ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారు ఆ ఇంట్లో సకల సంతోషాలు కలుగుతాయి. ఆ ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు లేకుండా ఉంటుంది. దాని కోసం రావి చెట్టు ఆకులను సేకరించి తోరణంగా చేసి ఇంటి ప్రధాన ద్వారానికి తోరణం లా కట్టాలి అవి ఎండిపోయాక తీసి వేసి తిరిగి మరో తోరణం కట్టాలి ఇలా తొమ్మిది సార్లు చేస్తే ,ఆ ఇంట్లో అన్ని సమస్యలు పోతాయి . పురాణాల ప్రకారం రవి చెట్టును అశ్వద్ధ వృక్షం అంటారు.

Also read : ఉగాది పండుగ విశిష్టత

Please share it

Leave a Comment