Nataraja Stotram in Telugu – శ్రీ నటరాజ స్తోత్రం

YouTube Subscribe
Please share it
Rate this post

Nataraja Stotram in Telugu

The Nataraja Stotram is a sacred hymn composed in praise of Lord Shiva’s cosmic dance form, known as Nataraja. This hymn beautifully describes the various aspects and symbolism associated with Lord Shiva’s dance. It highlights how Lord Shiva, as Nataraja, represents the eternal rhythm of creation, preservation, and destruction. The Nataraja Stotram also emphasizes the significance of Lord Shiva’s dance in bringing about harmony and balance in the universe. It praises Lord Shiva’s celestial form, adorned with serpents, crescent moon, and sacred ash, as he gracefully performs his Tandava dance, symbolizing the eternal cycle of life and death. The Nataraja Stotram is not only a powerful prayer that invokes the blessings of Lord Shiva, but it also carries a profound message about the cosmic dance of existence.

శ్రీ నటరాజ స్తోత్రం

నటరాజ స్తోత్రాన్ని పతంజలి రుషి రచించారు. దీనిని చరణ శృంగ రహిత స్తోత్రం లేదా శంభు నటనం లేదా నటేషాష్టకం అని కూడా అంటారు. ఈ స్తోత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, స్తోత్రంలోని ఎనిమిది చరణాలలో ఎక్కడా చరణ లేదా శృంగ ఉపయోగం లేదు. చరణం ఇక్కడ దీర్ఘం ను సూచిస్తుంది. శృంగం అంటే కొమ్ము. సాధారణంగా ఉపయోగించే వ్యాకరణం యొక్క రెండు లక్షణాలైనటువంటి దీర్ఘం, కొమ్ము లను ఉపయోగించకుండా ఈ అద్భుతమైన స్తోత్రాన్ని పతంజలి ముని రచించెను.

సదంచిత ముదంచిత నికుంచిత పదం ఝలఝలం-చలిత మంజు కటకం
పతంజలి దృగంజన-మనంజన-మచంచలపదం జనన భంజన కరమ్
కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబ కవిడంబక గళమ్
చిదంబుధి మణిం బుధ హృదంబుజ రవిం పర చిదంబర నటం హృది భజ || 1 ||

హరం త్రిపుర భంజన-మనంతకృతకంకణ-మఖండదయ-మంతరహితం
విరించిసురసంహతిపురంధర విచింతితపదం తరుణచంద్రమకుటమ్
పరం పద విఖండితయమం భసిత మండితతనుం మదనవంచన పరం
చిరంతనమముం ప్రణవసంచితనిధిం పర చిదంబర నటం హృది భజ || 2 ||

అవంతమఖిలం జగదభంగ గుణతుంగమమతం ధృతవిధుం సురసరిత్-
తరంగ నికురుంబ ధృతి లంపట జటం శమనదంభసుహరం భవహరమ్
శివం దశదిగంతర విజృంభితకరం కరళసన్మృగశిశుం పశుపతిం
హరం శశిధనంజయపతంగనయనం పర చిదంబర నటం హృది భజ || 3 ||

అనంతనవరత్నవిలసత్కటకకింకిణిఝలం ఝలఝలం ఝలరవం
ముకుందవిధి హస్తగతమద్దల లయధ్వనిధిమిద్ధిమిత నర్తన పదమ్
శకుంతరథ బర్హిరథ నందిముఖ భృంగిరిటిసంఘనికటం భయహరమ్
సనంద సనక ప్రముఖ వందిత పదం పర చిదంబర నటం హృది భజ || 4 ||

అనంతమహసం త్రిదశవంద్య చరణం ముని హృదంతర వసంతమమలమ్
కబంధ వియదింద్వవని గంధవహ వహ్నిమఖ బంధురవిమంజు వపుషమ్
అనంతవిభవం త్రిజగదంతర మణిం త్రినయనం త్రిపుర ఖండన పరమ్
సనంద ముని వందిత పదం సకరుణం పర చిదంబర నటం హృది భజ || 5 ||

అచింత్యమళివృంద రుచి బంధురగళం కురిత కుంద నికురుంబ ధవళమ్
ముకుంద సుర వృంద బల హంతృ కృత వందన లసంతమహికుండల ధరమ్
అకంపమనుకంపిత రతిం సుజన మంగళనిధిం గజహరం పశుపతిమ్
ధనంజయ నుతం ప్రణత రంజనపరం పర చిదంబర నటం హృది భజ || 6 ||

పరం సురవరం పురహరం పశుపతిం జనిత దంతిముఖ షణ్ముఖమముం
మృడం కనక పింగళ జటం సనక పంకజ రవిం సుమనసం హిమరుచిమ్
అసంఘమనసం జలధి జన్మకరలం కవలయంత మతులం గుణనిధిమ్
సనంద వరదం శమితమిందు వదనం పర చిదంబర నటం హృది భజ || 7 ||

అజం క్షితిరథం భుజంగపుంగవగుణం కనక శృంగి ధనుషం కరలసత్
కురంగ పృథు టంక పరశుం రుచిర కుంకుమ రుచిం డమరుకం చ దధతం
ముకుంద విశిఖం నమదవంధ్య ఫలదం నిగమ వృంద తురగం నిరుపమం
స చండికమముం ఝటితి సంహృతపురం పర చిదంబర నటం హృది భజ || 8 ||

అనంగపరిపంథినమజం క్షితి ధురంధరమలం కరుణయంతమఖిలం
జ్వలంతమనలం దధతమంతకరిపుం సతతమింద్ర సురవందితపదమ్
ఉదంచదరవిందకుల బంధుశత బింబరుచి సంహతి సుగంధి వపుషం
పతంజలి నుతం ప్రణవ పంజర శుకం పర చిదంబర నటం హృది భజ || 9 ||

ఇతి స్తవమముం భుజగపుంగవ కృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః
సదః ప్రభుపద ద్వితయదర్శనపదం సులలితం చరణ శృంగ రహితమ్
సరః ప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకరపదం
స గచ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదమ్ ||

ఇతి శ్రీ పతంజలి ముని ప్రణీతం చరన శృంగ రహిత నటరాజ స్తోత్రం సంపూర్ణం ||

Also read:శ్వేతార్క గణపతి స్తోత్రం 

Please share it

2 thoughts on “Nataraja Stotram in Telugu – శ్రీ నటరాజ స్తోత్రం”

Leave a Comment