Neela Saraswathi Stotram in Telugu-శ్రీ నీల సరస్వతీ స్తోత్రం

YouTube Subscribe
Please share it
Rate this post

Neela Saraswathi Stotram in Telugu

నీల సరస్వతి స్తోత్రం దశమహావిద్యలలో ఒకరైన నీల సరస్వతీ దేవిని ఆరాధించే భక్తి స్తోత్రం.  నీల సరస్వతీ దేవి అనుగ్రహం కోసం దీనిని జపించండి. మీ  జాతకంలో బుధుడు బలహీనుడుగా వున్నపుడూ,బుధ దశ జరుగుచున్నవారు, విద్యార్థులు,వ్యాపారస్తులకు,ఆర్ధికాభవృద్ధి కోరుకునే వారికి అద్భుత ఫలములను కల్గించును. నీల సరస్వతి స్తోత్రం మొదటి 8 శ్లోకాలు రోజుకి 5 సార్లు చదవాలి.9 నుండి 12 వరకు ఫలశ్రుతి శ్లోకాలు. ఒక్కసారి చదివితే చాలు.బాగా చదవటం నేర్చుకున్న తరువాత రోజుకి 21 సార్లు 108 రోజులు పారాయణ చెయ్యాలి మంచి ఫలితాలు కనపడతాయి.ఈ స్తోత్రం రోజుకి 108 సార్లు పారాయణ చేసి మంచి ఫలితాలు పొందిన వారు చాలా మంది ఉన్నారు.

శ్రీ నీల సరస్వతీ స్తోత్రం

శ్రీ గణేశాయ నమః

ఘోరరూపే మహారావే సర్వశత్రువశంకరీ |
భక్తేభ్యో వరదే దేవి త్రాహి మాం శరణాగతం || 1 ||

సురాఽసురార్చితే దేవి సిద్ధగంధర్వసేవితే |
జాడ్యపాపహరే దేవి త్రాహి మాం శరణాగతం || 2 ||

జటాజూటసమాయుక్తే లోలజిహ్వానుకారిణీ |
ద్రుతబుద్ధికరే దేవి త్రాహి మాం శరణాగతం || 3 ||

సౌమ్యరూపే ఘోరరూపే చండరూపే నమోఽస్తు తే |
దృష్టిరూపే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతం || 4 ||

జడానాం జడతాం హమ్సి భక్తానాం భక్తవత్సలే |
మూఢతాం హర మే దేవి త్రాహి మాం శరణాగతం || 5 ||

హ్రూం హ్రూంకారమయే దేవి బలిహోమప్రియే నమః |
ఉగ్రతారే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతం || 6 ||

బుద్ధిం దేహి యశో దేహి కవిత్వం దేహి దేహి మే |
కుబుద్ధిం హర మే దేవి త్రాహి మాం శరణాగతం || 7 ||

ఇంద్రాదిదేవ సద్వృందవందితే కరుణామయీ |
తారే తారాధినాథాస్యే త్రాహి మాం శరణాగతం || 8 ||

అథ ఫలశ్రుతిః 

అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం యః పఠేన్నరః |
షణ్మాసైః సిద్ధిమాప్నోతి నాఽత్ర కార్యా విచారణా || 1 ||

మోక్షార్థీ లభతే మోక్షం ధనార్థీ ధనమాప్నుయాత్ |
విద్యార్థీ లభతే విద్యాం తర్కవ్యాకరణాదికాం || 2 ||

ఇదం స్తోత్రం పఠేద్యస్తు సతతం శ్రద్ధయాన్వితః |
తస్య శత్రుః క్షయం యాతి మహాప్రజ్ఞా చ జాయతే || 3 ||

పీడాయాం వాపి సంగ్రామే జప్యే దానే తథా భయే |
య ఇదం పఠతి స్తోత్రం శుభం తస్య న సంశయః || 4 ||

స్తోత్రేణానేన దేవేశి స్తుత్వా దేవీం సురేశ్వరీం |
సర్వకామమవాప్నోతి సర్వవిద్యానిధిర్భవేత్ || 5 ||
ఇతి తే కథితం దివ్యం స్తోత్రం సారస్వతప్రదం |
అస్మాత్పరతరం నాస్తి స్తోత్రం తంత్రే మహేశ్వరీ || 6 ||

|| ఇతి బృహన్నిలతంత్రే ద్వితీయపటలే తారిణీ నీల సరస్వతీ స్తోత్రం సమాప్తం ||

Also read :మత్స్య స్తోత్రం 

 

Please share it

Leave a Comment