Sabarigirivasa Stotram in Telugu – శ్రీ శబరిగిరివాస స్తోత్రం

YouTube Subscribe
Please share it
5/5 - (1 vote)

Sabarigirivasa Stotram in Telugu

Sabarigirivasa Stotram is a special prayer that people in Telugu language say to show their love and respect for a mountain called Sabarigiri. They believe that this mountain is very holy and they want to show their gratitude to it. So, they sing this prayer and ask for blessings from the mountain.

శ్రీ శబరిగిరివాస స్తోత్రం

శబరిగిరినివాసం శాంతహృత్పద్మహంసం
శశిరుచిమృదుహాసం శ్యామలాంబోధభాసం |
కలితరిపునిరాసం కాంతముత్తుంగనాసం
నతినుతిపరదాసం నౌమి పింఛావతంసం || 1 ||

శబరిగిరినిశాంతం శంఖకుందేందుదంతం
శమధనహృదిభాంతం శత్రుపాలీకృతాంతం |
సరసిజరిపుకాంతం సానుకంపేక్షణాంతం
కృతనుతవిపదంతం కీర్తయేఽహం నితాంతం || 2 ||

శబరిగిరికలాపం శాస్త్రవద్ధ్వాంతదీపం
శమితసుజనతాపం శాంతిహానైర్దురాపం |
కరధృతసుమచాపం కారణోపాత్తరూపం
కచకలితకలాపం కామయే పుష్కలాభమ్ || 3 ||

శబరిగిరినికేతం శంకరోపేంద్రపోతం
శకలితదితిజాతం శత్రుజీమూతపాతం |
పదనతపురహూతం పాలితాశేషభూతం
భవజలనిధిపోతం భావయే నిత్యభూతం || 4 ||

శబరివిహృతిలోలం శ్యామలోదారచేలం
శతమఖరిపుకాలం సర్వవైకుంఠబాలం |
నతజనసురజాలం నాకిలోకానుకూలం
నవమయమణిమాలం నౌమి నిఃశేషమూలం || 5 ||

శబరిగిరికుటీరం శత్రుసంఘాతఘోరం
శఠగిరిశతధారం శష్పితేంద్రారిశూరం |
హరిగిరీశకుమారం హారికేయూరహారం
నవజలదశరీరం నౌమి విశ్వైకవీరం || 6 ||

సరసిజదళనేత్రం సారసారాతివక్త్రం
సజలజలదగాత్రం సాంద్రకారుణ్యపాత్రం |
సహతనయకళత్రం సాంబగోవిందపుత్రం
సకలవిబుధమిత్రం సన్నమామః పవిత్రం || 7 ||

ఇతి శ్రీ శబరిగిరివాస స్తోత్రం ||

Also read :పశుపత్యష్టకం 

Please share it

Leave a Comment