sri kamala kavacham in telugu

YouTube Subscribe
Please share it
Rate this post

sri kamala kavacham in telugu

దశ మహా విద్యలలో 10వ మహా విద్య కమలాత్మిక దేవి. సకల ఐశ్వర్య ప్రధాయిని ఈమె. ఈమెకు మార్గశిర అమావాస్య తిథి ప్రీతిపాత్రమైంది.

కమలాత్మిక అంటే లక్ష్మీస్వరూపిణి అని అర్థం.శాంతస్వరూపిణి అయిన ఈ అమ్మవారిని ఉపాశిస్తే సకల సంపదల్ని పూత్ర పౌత్రాభివృద్ధిని సుఖ సంతోషాన్ని ఇస్తుంది.ఈమె పరమ శాంతస్వరూపిణి ఐశ్వర్య ప్రదాయిని. భార్గవ మహా రుషి చేత దర్శించబడింది కాబట్టి, ఈ దీవిని భార్గవి అని కూడా పిలుస్తారు.

కమల అనగా కలువ పువ్వుకు చెందినది అని అర్థం. ఈమె సంపదలకు సంతాన భాగ్యానికి, పాడిపంటలకు అది దేవత.ఈమె తెల్లటి శరీర చాయ కలిగి ఉంటుంది. ఈమెకు నాలుగు చేతులు కలిగి రెండు చేతులలో రెండు కలవ పువ్వులు, మిగతా రెండు చేతులతో అభయమిస్తూ ఉంటుంది.ఈమె ఒక కలువ పువ్వులో కూర్చుని ఉండగా, ఆమెకు నాలుగు తెల్ల ఏనుగులు తమ తొండాలతో, ఈమె పై అమృతాన్ని వెదజల్లుతూ ఈమెకు అభిషేకాన్ని చేస్తూ ఉంటాయి. ఈ తమలాత్మిక కవచాన్ని నిత్యం పఠించిన వారికి సకల శుభ ఫలితాలు కలుగుతాయి

శ్రీ కమలా కవచం

ఈశ్వర ఉవాచ |
అథ వక్ష్యే మహేశాని కవచం సర్వకామదమ్ |
యస్య విజ్ఞానమాత్రేణ భవేత్సాక్షాత్సదాశివః || 1 ||

నార్చనం తస్య దేవేశి మంత్రమాత్రం జపేన్నరః |
స భవేత్పార్వతీపుత్రః సర్వశాస్త్రేషు పారగః |
విద్యార్థినా సదా సేవ్యా విశేషే విష్ణువల్లభా || 2 ||

అస్యాశ్చతురక్షరివిష్ణువనితారూపాయాః కవచస్య శ్రీభగవాన్ శివ ఋషిరనుష్టుప్ఛందో, వాగ్భవీ దేవతా, వాగ్భవం బీజం, లజ్జా శక్తిః, రమా కీలకం, కామబీజాత్మకం కవచం, మమ సుపాండిత్య కవిత్వ సర్వసిద్ధిసమృద్ధయే జపే వినియోగః ||

అథ కవచమ్ |
ఐంకారీ మస్తకే పాతు వాగ్భవీ సర్వసిద్ధిదా |
హ్రీం పాతు చక్షుషోర్మధ్యే చక్షుర్యుగ్మే చ శాంకరీ || 1 ||

జిహ్వాయాం ముఖవృత్తే చ కర్ణయోర్గండయోర్నసి |
ఓష్ఠాధరే దంతపంక్తౌ తాలుమూలే హనౌ పునః || 2 ||

పాతు మాం విష్ణువనితా లక్ష్మీః శ్రీవర్ణరూపిణీ |
కర్ణయుగ్మే భుజద్వంద్వే స్తనద్వంద్వే చ పార్వతీ || 3 ||

హృదయే మణిబంధే చ గ్రీవాయాం పార్శ్వయోః పునః |
సర్వాంగే పాతు కామేశీ మహాదేవీ సమున్నతిః || 4 ||

వ్యుష్టిః పాతు మహామాయా ఉత్కృష్టిః సర్వదాఽవతు |
సంధిం పాతు సదా దేవీ సర్వత్ర శంభువల్లభా || 5 ||

వాగ్భవీ సర్వదా పాతు పాతు మాం హరిగేహినీ |
రమా పాతు సదా దేవీ పాతు మాయా స్వరాట్ స్వయమ్ || 6 ||

సర్వాంగే పాతు మాం లక్ష్మీర్విష్ణుమాయా సురేశ్వరీ |
విజయా పాతు భవనే జయా పాతు సదా మమ || 7 ||

శివదూతీ సదా పాతు సుందరీ పాతు సర్వదా |
భైరవీ పాతు సర్వత్ర భైరుండా సర్వదాఽవతు || 8 ||

త్వరితా పాతు మాం నిత్యముగ్రతారా సదాఽవతు |
పాతు మాం కాలికా నిత్యం కాలరాత్రిః సదాఽవతు ||9 ||

నవదుర్గా సదా పాతు కామాఖ్యా సర్వదాఽవతు |
యోగిన్యః సర్వదా పాంతు ముద్రాః పాంతు సదా మమ ||10 ||

మాతరః పాంతు దేవ్యశ్చ చక్రస్థా యోగినీగణాః |
సర్వత్ర సర్వకార్యేషు సర్వకర్మసు సర్వదా || 11 ||

పాతు మాం దేవదేవీ చ లక్ష్మీః సర్వసమృద్ధిదా |
ఇతి తే కథితం దివ్యం కవచం సర్వసిద్ధయే || 12 ||

యత్ర తత్ర న వక్తవ్యం యదీచ్ఛేదాత్మనో హితమ్ |
శఠాయ భక్తిహీనాయ నిందకాయ మహేశ్వరి || 13 ||

న్యూనాంగే అతిరిక్తాంగే దర్శయేన్న కదాచన |
న స్తవం దర్శయేద్దివ్యం సందర్శ్య శివహా భవేత్ || 14 ||

కులీనాయ మహోచ్ఛ్రాయ దుర్గాభక్తిపరాయ చ |
వైష్ణవాయ విశుద్ధాయ దద్యాత్కవచముత్తమమ్ || 15 ||

నిజశిష్యాయ శాంతాయ ధనినే జ్ఞానినే తథా |
దద్యాత్కవచమిత్యుక్తం సర్వతంత్రసమన్వితమ్ || 16 ||

విలిఖ్య కవచం దివ్యం స్వయంభుకుసుమైః శుభైః |
స్వశుక్రైః పరశుక్రైశ్చ నానాగంధసమన్వితైః || 17 ||

గోరోచనాకుంకుమేన రక్తచందనకేన వా |
సుతిథౌ శుభయోగే వా శ్రవణాయాం రవేర్దినే || 18 ||

అశ్విన్యాం కృత్తికాయాం వా ఫల్గున్యాం వా మఘాసు చ |
పూర్వభాద్రపదాయోగే స్వాత్యాం మంగళవాసరే || 19 ||

విలిఖేత్ ప్రపఠేత్ స్తోత్రం శుభయోగే సురాలయే |
ఆయుష్మత్ప్రీతియోగే చ బ్రహ్మయోగే విశేషతః || 20 ||

ఇంద్రయోగే శుభయోగే శుక్రయోగే తథైవ చ |
కౌలవే బాలవే చైవ వణిజే చైవ సత్తమః || 21 ||

శూన్యాగారే శ్మశానే వా విజనే చ విశేషతః |
కుమారీం పూజయిత్వాదౌ యజేద్దేవీం సనాతనీమ్ ||22 ||

మత్స్యమాంసైః శాకసూపైః పూజయేత్పరదేవతామ్ |
ఘృతాద్యైః సోపకరణైః పూపసూపైర్విశేషతః || 23 ||

బ్రాహ్మణాన్భోజాయిత్వాదౌ ప్రీణయేత్పరమేశ్వరీమ్ |
బహునా కిమిహోక్తేన కృతే త్వేవం దినత్రయమ్ || 24 ||

తదాధరేన్మహారక్షాం శంకరేణాభిభాషితమ్ |
మారణద్వేషణాదీని లభతే నాత్ర సంశయః || 25 ||

స భవేత్పార్వతీపుత్రః సర్వశాస్త్రవిశారదః |
గురుర్దేవో హరః సాక్షాత్పత్నీ తస్య హరప్రియా || 26 ||

అభేదేన భజేద్యస్తు తస్య సిద్ధిరదూరతః |
సర్వదేవమయీం దేవీం సర్వమంత్రమయీం తథా || 27 ||

సుభక్త్యా పూజయేద్యస్తు స భవేత్కమలాప్రియః |
రక్తపుష్పైస్తథా గంధైర్వస్త్రాలంకరణైస్తథా || 28 ||

భక్త్యా యః పూజయేద్దేవీం లభతే పరమాం గతిమ్ |
నారీ వా పురుషో వాపి యః పఠేత్కవచం శుభమ్ |
మంత్రసిద్ధిః కార్యసిద్ధిర్లభతే నాత్ర సంశయః || 29 ||

పఠతి య ఇహ మర్త్యో నిత్యమార్ద్రాంతరాత్మా
జపఫలమనుమేయం లప్స్యతే యద్విధేయమ్ |
స భవతి పదముచ్చైః సంపదాం పాదనమ్రః
క్షితిపముకుటలక్ష్మీర్లక్షణానాం చిరాయ || 30 ||

ఇతి శ్రీవిశ్వసారతంత్రోక్తం చతురక్షరీ విష్ణువనితా కవచం నామ శ్రీ కమలా కవచమ్ |

Also read: శ్రీ చండీ కవచం

Please share it

Leave a Comment