Subrahmanya Shashti
సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్టి దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం. ఈ పండుగని సుబ్బరాయ షష్టి అని కూడా పిలుస్తారు. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్ఠి గా ఆచరిస్తారు. సులభ ప్రసన్నుడైన కుమార స్వామిని ఈరోజు నా అర్చించి భక్తులు అభీష్టసిద్ధి పొందుతారు. సర్ప రూపంగా భావించి పుట్టలో పాలు పోయడం ఈ రోజున కొన్ని చోట్ల ఆచారంగా ఉంది. కొందరు ఈ రోజున ఉపాసనా ది నియమాలతో స్వామిని అర్చిస్తారు. ఏ విధంగానైనా ఈ రోజున షణ్ముఖి ని పూజించడం సర్వోత్తమం సర్వారిష్ట పరిహారం .
Rituals during Subrahmanya Shasthi
ఈరోజున అవివాహితులు ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో సుబ్రమణ్య స్వామి ఆలయం సందర్శనం చేసుకుని అభిషేకం చేయడం నాగ పాము పుట్టకు పూజ చేయడం వలన అవివాహితులకు వివాహ బలం చేకూరుతుంది, కుజదోషం ఉన్న వారికి నివారణ కలుగుతుంది, అలాగే కాలసర్ప దోష నివారణ వివాహ ప్రాప్తి, సంతానభాగ్యం లేని వారికి సంతాన ప్రాప్తి, వైవాహిక దోష నివారణ కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, శత్రువు బాధలనుండి విముక్తి లభిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని పాలతో అభిషేకం చేసి సిద్ధ గంధము కుంకుమలతో అలంకరణ చేసి, ఎర్రని పువ్వులతో అష్టోత్తర శతనామాలతో పూజ చేసి ధూప నైవేద్యాలతో భక్తిశ్రద్ధలతో పూజిస్తే అత్యున్నత శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున ఎర్రని పండ్లు పూలు వస్త్రములు ముత్తైదువులకు దానం ఇవ్వడం వలన, మరియు బెల్లముతో చేసిన పరమాన్నం స్వామి వారికి నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించి ఇతరులకు, పేదల కు ప్రసాదం పంచి పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడు గా చెప్పుకునే కుమారస్వామి భూలోకంలోని అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి తన భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. స్వామి సాధారణంగా శక్తి ఆయుధాన్ని ధరించి నెమలి వాహనంతో స్వామి దర్శనం ఇస్తుంటాడు. కొన్ని ప్రాంతాల్లో ఇలా దర్శనమిచ్చే స్వామి కొన్ని ప్రదేశాల్లో మాత్రం సర్పాకారంలో లింగాకారంలో పూజలు అందుకుంటూ భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ, భక్తుల పాలిట కొంగు బంగారం మై వెలిశాడు. స్వామి అత్తిలిలో స్వయంభూ గా కనిపిస్తాడు. అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం, ఇది పశ్చిమగోదావరి జిల్లా లో కలదు.
Significance of Subrahmanya Shashti
ఇక స్వామి వారి జన్మ వృత్తాంతం తెలుసుకుందాం :– పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారినుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుడిని శరణువేడారు. ఈ తారకాసురుడు అనే రాక్షసుడు శివుని అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేసి బాలునితో తప్ప ఇతరులతో చావు లేని వరం పొందాడు. దీనితో తాను అజేయుడు అని అమరుడు అని గర్వంతో ముల్లోకాలను గజగజలాడించ సాగాడు.
ఈ తారకాసురుడు తపో బలసంపన్నుడు బలశాలి కావున దేవతలారా సతీ వియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు, ఆ సతీ దేవి మరుజన్మలో గిరిరాజ హిమవంతునికి పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసురుడిని సంహరించగలదు సమర్ధుడు అవుతాడు అని బ్రహ్మదేవుడు దేవతలకు తరుణోపాయం చెప్పాడు .
దేవతలు మన్మధుని సహాయంతో శివునికి పార్వతికి అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పిస్తారు. మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింప చేసి మన్మధుడు ఈశ్వరుని యొక్క ఆగ్రహానికి గురి అయినా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణభూతుడు అవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్థన మేరకు పునర్జీవింప బడతాడు. ఒక రోజున పార్వతీ పరమేశ్వరులు ఏకాంత సమయంలో అగ్నిదేవుడు పావురం యొక్క రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమశివుడు తన దివ్య తేజస్సును అగ్నిహోత్రుడు లోనికి ప్రవేశ పెడతాడు. దానిని భరించలేం అటువంటి అగ్నిదేవుడు ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయంలో ఆ నదిలో స్నానము చేయుచన్న షట్ కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆరుద్ర తేజాన్ని వారు భరించలేక రేల్లు పొదలలో విసర్జిస్తారు. ఆ తరువాత ఆ ఆరు తేజస్సును కలిసి ఆరు ముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. అక్కున చేర్చుకుని కైలాసానికి తీసుకువెళ్తారు. ఈ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందున గంగేయుడనే అని శక్తి గల వారిని పెంచి పెద్ద చేసిన కారణంవల్ల మరియు ఆరుముఖాలు కలవాడు కనుక షణ్ముఖుడు అని నీ కార్తీకేయుడని, గౌరీ శంకరుల పుత్రుడు అవటం వలన కుమారస్వామి అని వివిధ నామాలతో భక్తులు పిలుచుకుంటారు. దేవతల కోరిక మేరకు సుబ్రహ్మణ్యస్వామిని దేవతల సర్వ సైన్యాధ్యక్షుడు గా పరమేశ్వరుడు నియమించి, శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి దేవి కుమారుడిని దీవించి, శక్తి అని ఆయుధాలు ఇచ్చి సర్వశక్తివంతుడైన చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంతట నెమలి వాహనంపై కూర్చుండి, ఆరు ముఖాలూ 12 చేతులూ తో ఉగ్ర రూపాన్ని దాల్చి, ఆరు చేతులతో ధనస్సును, మరో ఆరు చేతులతో బాణాలను ధరించి, మరియు ఒకసారి సర్ప రూపం ధరించి, భీకర యుద్ధం చేసి రాక్షసి సేనలను , తారకాసురుని సంహరించి విజయుడై నాడు. సర్వ శక్తి స్వరూపుడైన అయిన ఈ స్వామికి దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన ఈ రోజును మనం స్కంద శక్తిగా, సుబ్రమణ్య శక్తిగా జరుపుకుంటాము. ఈ సుబ్రహ్మణ్య షష్టి రోజున భక్తులు తెల్లవారి లేచి తలంటు స్నానం చేసి పాలు పంచదార తో నిండిన కావిడ ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. అయితే ఈ కావడి లోని వస్తువులు భక్తుల మొక్కులు బట్టి ఉంటాయి. ఈ ఆచారం తమిళనాడులో విశేషంగా ఆచరణలో ఉన్నది. సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందని పండితులు చెప్తారు. ఈరోజు ఉపవాసం వుండి సర్ప మంత్రాన్ని (,సర్ప సూక్తం) నిష్ఠగా జపిస్తే మళ్ళీ సంవత్సరం వరకూ గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా పెద్దలు చెప్తారు.
ఇవి కూడా చదవండి : సర్ప సూక్తం