Sarpa Suktam – సర్ప సూక్తం

సర్పరూపుడైన సుబ్రమణ్య స్వామి, కుజునికి అధిష్టాన దైవం. అలాగే రాహు కి, సుబ్రహ్మణ్యస్వామి సర్ప మంత్రాలకు అధిష్ఠాన దైవాలు. అలాగే కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి పూజ సర్ప పూజలు చేయాలి.
మానవుని జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తిని ధైర్యాన్ని ఇస్తాడు అందువలన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్ప రూపుడు కావున సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్యస్వామి ఆధీనంలో ఉంటాయి.అందువలన సుబ్రహ్మణ్య ఆరాధనం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వల్ల సర్ప, కేతు గ్రహ దోషాలు కూడా పరిహారం జరుగుతుంది.
మంగళవారం లేదా శుద్ధ షష్టి, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలసిన రోజైనా కుజుడికి, సుబ్రహ్మణ్యేశ్వరుని కి ప్రీతికరము. ఆరోజున కుజ మంత్రం జపించాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర మంత్రం జపించాలి తరువాత సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తరశతనామావళి తో పూజ చేయాలి. ఇలా తొమ్మిది రోజులపాటు నిష్టగా జపము పూజచేసి చంద్ర లేదా మోదక పూలతో నెయ్యి తేనెలతో తొమ్మిది సార్లు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే చాలా మంచిదని చెబుతారు దీనివలన కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ పూజ అనంతరం సర్పసూక్తం లేదా సర్ప మంత్రాలు చదవడం వల్ల ఇంకా మేలు జరుగుతుంది.
జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు, అన్ని విధాలా దోష పరిహారం జరుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కావున స్వామికి మొక్కుకున్న వారికి తన రూపంలో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్మకం. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని మహిళలు పూజలు చేయడం తరచుగా మనం చూస్తూ ఉంటాం.
అలాగే సంతాన ప్రాప్తిని కోరి మహిళలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య కేతు మంత్రాలతో ఇరవై ఒక్కసార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని, పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టూ ఇరవై ఒక్క లేదా 108 సార్లు లేదా మండలం పాటు అనగా 40 రోజుల పాటు ప్రదక్షణాలు చేస్తే సుబ్రహ్మణ్య అనుగ్రహం కలిగి సర్వ దుఖాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.
నమో॑ అస్తు స॒ర్పేభ్యో॒ యే కే చ॑ పృథి॒వీ మను॑ |
యే అ॒న్తరి॑క్షే॒ యే ది॒వి తేభ్య॑: స॒ర్పేభ్యో॒ నమ॑: |
యే॑ఽదో రో॑చ॒నే ది॒వో యే వా॒ సూర్య॑స్య ర॒శ్మిషు॑ |
యేషా॑మ॒ప్సు సద॑: కృ॒తం తేభ్య॑: స॒ర్పేభ్యో॒ నమ॑: |
యా ఇష॑వో యాతు॒ధానా॑నా॒o యే వా॒ వన॒స్పతీ॒గ్॒o రను॑ |
యే వా॑ఽవ॒టేషు॒ శేర॑తే॒ తేభ్య॑: స॒ర్పేభ్యో॒ నమ॑: |
ఇ॒దగ్ం స॒ర్పేభ్యో॑ హ॒విర॑స్తు॒ జుష్టమ్” |
ఆ॒శ్రే॒షా యేషా॑మను॒యన్తి॒ చేత॑: |
యే అ॒oతరి॑క్షం పృథి॒వీం క్షి॒యన్తి॑ |
తే న॑స్స॒ర్పాసో॒ హవ॒మాగ॑మిష్ఠాః |
యే రో॑చ॒నే సూర్య॒స్యాపి॑ స॒ర్పాః |
యే దివ॑o దే॒వీమను॑స॒న్చర॑న్తి |
యేషా॑మాశ్రే॒షా అ॑ను॒యన్తి॒ కామమ్” |
తేభ్య॑స్స॒ర్పేభ్యో॒ మధు॑మజ్జుహోమి || ౨ ||
ని॒ఘృష్వై॑రస॒మాయు॑తైః |
కాలైర్హరిత్వ॑మాప॒న్నైః |
ఇంద్రాయా॑హి స॒హస్ర॑యుక్ |
అ॒గ్నిర్వి॒భ్రాష్టి॑వసనః |
వా॒యుశ్వేత॑సికద్రు॒కః |
స॒oవ॒థ్స॒రో వి॑షూ॒వర్ణై”: |
నిత్యా॒స్తేఽనుచ॑రాస్త॒వ |
సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సు॑బ్రహ్మణ్యోగ్ం ||
||ఓం శాంతిః శాంతిః శాంతిః ||
వీటిని కూడా చదవండి : దేవి ఖడ్గమాలా స్తోత్రం
: శ్రీ హానుమాన్ బడబానల స్త్రోత్రం
: శ్రీ లలితా సహస్త్ర నామ స్తోత్రం
ఈ దేవాలయం దర్శించండి : శ్రీ కదిరి లక్ష్మి నరసింహ దేవాలయం
Veda swaras are wrong. Please check once again. Swaras are shifted to next letter, which is wrong.