Teekshna Damstra Kalabhairava Ashtakam in Telugu
తీక్షణ దంష్ట్ర కాలభైరవ అష్టకం
తీక్ష్ణ దంష్ట్ర కాలభైరవ అష్టకం చాలా శక్తివంతమైన మంత్రం. జీవితం సమస్యలతో నిండినప్పుడు, అవమానాలతో సతమతమవుతున్నప్పుడు, అగమ్యగోచరమైన మార్గాల్లో అశాంతి ఏర్పడినప్పుడు, అనవసరమైన భయాలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు, తీక్ష్ణ దంష్ట్ర కాలభైరవ అష్టకాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల ఎటువంటి దోషాలు నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. దీనివలన క్రమంగా మీరు జీవితంలో శాంతి మరియు ఆనందాన్ని పొందుతారు.
ఓం యం యం యం యక్షరూపం దశదిశివిదితం భూమికం పాయమానం
సం సం సం సంహారమూర్తిం శిరముకుటజటా శేఖరం చంద్రబింబం ।
దం దం దం దీర్ఘకాయం విక్రితనఖ ముఖం చోర్ధ్వరోమం కరాలం
పం పం పం పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 1 ॥
రం రం రం రక్తవర్ణం కటికటితతనుం తీక్ష్ణదంష్ట్రాకరాలం
ఘం ఘం ఘం ఘోష ఘోషం ఘ ఘ ఘ ఘ ఘటితం ఘర్ఝరం ఘోరనాదమ్ ।
కం కం కం కాలపాశం దృక దృక దృకితం జ్వాలితం కామదేహం
తం తం తం దివ్యదేహం ప్రణమత సతతం, భైరవం క్షేత్రపాలమ్ ॥ 2 ॥
లం లం లం లం వదన్తం ల ల ల ల లలితం దీర్ఘ జిహ్వా కరాళం
ధుం ధుం ధుం ధూమ్రవర్ణం స్ఫుట వికటముఖం భాస్కరం భీమరూపమ్ ।
రుం రుం రుం రుండమాలం రవితను నియతం తామ్రనేత్రం కరాళం
నం నం నం నగ్నభూషం ప్రణమత సతతం, భైరవం క్షేత్రపాలమ్ ॥ 3 ॥
వం వం వం వాయువేగం నతజనసదయం బ్రహ్మపారం పరన్తం
ఖం ఖం ఖం ఖడ్గహస్తం త్రిభువనవిలయం భాస్కరం భీమరూపమ్ ।
చం చం చం చలిత్వాచల చల చలితా చాలితం భూమిచక్రం
మం మం మం మాయి రూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 4 ॥
శం శం శం శఙ్ఖహస్తం శశికరధవళం మోక్ష సంపూర్ణ తేజం
మం మం మం మం మహాన్తం కులమకులకుళం మంత్రగుప్తం సునిత్యమ్ ।
యం యం యం భూతనాథం కిలికిలికిలితం బాలకేళిప్రదానం
అం అం అం అంతరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 5 ॥
ఖం ఖం ఖం ఖడ్గభేదం విషమమృతమయం కాలకాలం కరాళం
క్షం క్షం క్షం క్షిప్రవేగం దహదహదహనం తప్తసన్దీప్యమానమ్ ।
హౌం హౌం హౌంకారనాదం ప్రకటితగహనం గర్జితైర్భూమికమ్పం
వం వం వం వాలలీలం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 6 ॥
సం సం సం సిద్ధియోగం సకలగుణమఖం దేవ దేవం ప్రసన్నమ్
పం పం పం పద్మ నాధం హరిహర మయనం చంద్ర సూర్యాగ్నినేత్రం |
ఐం ఐం ఐం ఐశ్వర్యనాధం సతత భయహరం పూర్వదేవం స్వరూపం
రౌం రౌం రౌం రౌద్రరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 7 ॥
హం హం హం హంసయానం హసితకలహకం ముక్తయోగాట్టహాసం
ధం ధం ధం నేత్రరూపం శిరముకుటజటాబన్ధ బన్ధాగ్రహస్తమ్ ।
తం తం తంకానాదం త్రిదశలటలటం కామగర్వాపహారం,
భృం భృం భృం భూతనాథం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ ॥ 8 ॥
ఇత్యేవం కామయుక్తం ప్రపటతి నియతం భైరవస్యాష్టకం
యో నిర్విఘ్నం దు:ఖనాశం సురభయహరణం డాకినీశాకినీనాం |
నశ్యేద్ది వ్యాఘ్రసర్పౌహుత వహసలిలే రాజ్యశంసశ్య శూన్యం
సర్వానశ్యంతి దూరం విపద ఇది బృశం చింతనాత్సర్వసిద్ధం ||
భైరవస్యాష్టకమిదం షాన్మానం యః పఠేనరః
స యాతి పరమం స్థానం యత్ర దేవో మహేశ్వరః ||
సింధూరారుణ గాత్రం చ సర్వజన్మ వినిర్మితం
ముకుటాగ్ర్యధరం దేవం భైరవం ప్రణమామ్యహమ్ ||
నమో భూతనాథం నమో ప్రేతనాథం
నమః కాలకాలం నమః రుద్రమాలమ్ ।
నమః కాలికాప్రేమలోలం కరాలం
నమో భైరవం కాశికాక్షేత్రపాలమ్ ॥
ఇతి తీక్షణ దంష్ట్ర కాలభైరవాష్టకం సంపూర్ణం ||
అయ్యా ఇవి కూడా చదవండి :ఏకముఖ రుద్రాక్షమాలను ధరిస్తే..