Vastu in telugu

YouTube Subscribe
Please share it
5/5 - (1 vote)

Vastu in telugu

చేతిలోని గీతలను బట్టి జరిగింది జరగబోయేది ఎలా చెప్తారో, అలాగే ఇంటిలో దిశలను బట్టి ఫలాలను అంచనా వేయవచ్చు. ఐతే గమనించవలసిన విషయం ఏమిటంటే చేతిలోని గీతలను మనం మార్చడానికి వీలుకాదు కానీ వాస్తు పరంగా ఇంట్లో దిశలను అనుకూలంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది.  రోగికి వైద్యం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది అదేవిధంగా దోషపూరిత మైన గృహాలు వాస్తు పరంగా సరిచేస్తే ఆ దోషాలు పోయి ఇల్లు నివాస యోగ్యం అవుతుంది సుభిక్షం అవుతుంది.

వాస్తులో ప్రతి దిక్కు కు ఒక ధర్మం ఉంటుంది,ఆ ధర్మాన్ని దిక్కులు నిర్వహిస్తాయి. అందుకు ఆ భూమి లేదా ఇంటి యజమాని లేదా యజమానురాలి సహకారం కూడా ఉండాలి. ఒక దిశ గాని కొన్ని దిశలో గాని దోషపూరిత మైనవి గా ఉన్నప్పుడు, ఇంటి యజమాని దానిని కనుక్కొని సరి చేసినట్లయితే సత్ఫలితాలను పొందవచ్చు.

ఒక ఇంటి స్థలానికి సాధారణంగా నాలుగు భుజాలు ఉంటాయి, అంటే ఇంటికి స్వరూపం చతురస్రంగా గాని, దీర్ఘ చతురస్రం గాని, సాధారణంగా ఉంటుంది. ఆ నాలుగు భుజాలు తూర్పు, పడమర ,ఉత్తర, దక్షిణ భుజాలు.

మనకు తెలిసిన ముఖ్యమైన నాలుగు దిశలు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్య దిశలను ‘విదిక్కులు’ అంటాము.

సూర్యునికి అభిముఖంగా తిరిగి సూర్యోదయ దిశగా ఉంటే ఆ దిశను తూర్పు అంటారు. అలా ఉండగా మన ఎడమ వైపు గల దిక్కును ఉత్తరదిశ అంటారు, కుడి వైపుకు ఉన్న దిక్కును దక్షిణం అని, వెనక వైపు ఉన్న దిక్కును పడమర దిశగా పరిగణిస్తారు. తూర్పు, ఉత్తరానికి మధ్య గల దిక్కును ఈశాన్యం అంటారు. తూర్పుకు దక్షిణానికి మధ్య గల దిక్కును ఆగ్నేయం అంటారు. పడమరకు ఉత్తరానికి మధ్య గల దిక్కును వాయువ్యం అంటారు. పడమర కు దక్షిణానికి మధ్యగల దిక్కు నైరుతి అని అంటాం.

ఐతే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏ దిక్కు ఎవరు అధిపతులు అని. తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు. ఆగ్నేయ దిక్కు అధపతి అగ్ని దేవుడు. దక్షిణ దిక్కుకు అధిపతి యముడు. నైరుతి దిక్కుకు అధిపతి నిర్మితి. పడమర దిక్కుకు అధిపతి వరుణుడు. వాయువు దిక్కుకు అధిపతి వాయువు. ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. ఈశాన్య దిక్కుకు అధిపతి ఈశానుడు.

ముఖద్వారం తూర్పునకు ఉండటంవల్ల పుత్రసంతానం, కీర్తిప్రతిష్టలు, గౌరవం మర్యాదలు, కలుగుతాయి. ఇంట్లో తూర్పు దిక్కులో బరువులు ఉండకూడదు అది అశుభము. కావున తూర్పు దిక్కులు బరువులు లేకుండా చూసుకోవాలి.

ఆగ్నేయంలో అగ్నిదేవుడు ఆహారం దీర్ఘాయువు ఆరోగ్యాలకు అధిపతియై ఉండటంవల్ల, చేతి వంట, ఇంటి విద్యుత్ మెయిన్ బోర్డు లు ఈ దిశగా ఉండటం సర్వవిధాలా అత్యంత శుభదాయకం. అలాగే ఆగ్నేయ మూల బరువులు ఉంచకూడదు. అలా ఉంచితే అగ్ని భయాలు ప్రమాదాలు కలుగుతాయి కావున ఆగ్నేయ దిశగా బరువులు ఉంచకండి.

దక్షిణ దిశకు అధిపతి యముడు కావున ఈయన న్యాయానికి సత్యానికి అతి పెద్ద గా ఉండటంవల్ల అటువైపు తల పెట్టుకుని నిద్రించడం చేత, ఆ ఇంటిలో నివసించే వారికి మంచి నడవడిక యోగ్యులైన మిత్రులు నిజాయితీ కలుగుతాయి. అంతేకాదు దక్షిణ దిశగా ఇంట్లో బరువు ఉండటం అత్యంత శుభం.

అలాగే నైరుతికి రక్షకుడు నిర్మితి కావడం చేత, ఆ ఇంటి యజమాని ఆ దిక్కున ఉండటం శ్రేయస్కరం ఇంట్లో బరువైన వస్తువు సామాగ్రిని ఆ దిశగా ఉంచడం కూడా మంచిదే. అంతేకాదు నైరుతి దిశగా ఇంట్లో కాళిస్థలం ఉండకూడదు ద్వారాలు బయట ద్వారం కూడా ఉండరాదు నైరుతిదిశలో బరువులు ఉండటం చాలా శుభం అంతేకాదు, ఆ ఇంటికి శత్రుభయం కూడా ఉండదు.

పడమర దిక్కుకు అధిపతి వరుణుడు కావడంవల్ల, ఇంట్లో స్త్రీ సంతాన వృద్ధి, ఐశ్వర్య ప్రాప్తి, కలుగుతుంది. ఈ దిశగా జీవించే వారు సాధారణంగా ఆధిపత్య స్థానాలలో ఉంటారు. మిక్కిలి చాతుర్యం తెలివైన వారుగా ఉంటారు. ఇంట్లో ఈదిక్కులో ద్వారం లేదా మెట్లు ఉండటం అత్యంత శుభకరము.

వాయువ్య దిశ కు అధిపతి వాయుదేవుడు. వాయుదేవుడు ఇంటి యజమానికి మంచి ఆలోచన, మంచి కుటుంబాన్ని ఇస్తాడు. ఐతే మీరు తెలుసుకోవాల్సింది వాయువ్య దిశగా ద్వారం ఉండకూడదు. వాయువ్యదిశలో ఇంట్లో బరువు లేకపోతే, ఇంట్లో వారికి మంచి ప్రవర్తన స్థిరత్వం కలుగుతాయి. దీనిని బట్టి మీకు ఏమి అర్థం అయ్యింది, అంటే వాయువ్య దిశలో ఇంట్లో బరువులు ఉంచకండి.‌

ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు ఈయన ఐశ్వర్య కారకుడు.ఉత్తరదిశగా జీవించే వారికి మంచి విద్యా సంపద కలుగుతాయి. వీరు మంచి చాతుర్యం తెలివైన వారిగా ఎదుగుతారు. ఉన్నత పదవులు చేపట్టే అవకాశం కూడా ఉంటుంది. అయితే మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఉత్తరదిశ లో ఉంచిన దేవుడి చిత్రపటం దర్శించుకోవడం చాలా శుభకరం. అలాగే ఇంట్లో ఉత్తరం పూల బరువు లేకపోవటం వలన ధన ధాన్యభివృద్ధి కలుగుతుంది.

ఈశాన్య దిశలో నివసించేవారు కార్యదీక్ష గలవారు అని చెప్పవచ్చు, విషయాలను సాధించేవారు అని చెప్పవచ్చు. ఈ దిక్కు అన్ని దిక్కుల్లో కల్లా ముఖ్యమైంది గా చెప్పుకోవచ్చు. అందువలన ఈశాన్య దిక్కులో పూజామందిరాన్ని గురించి పూజలు చేస్తే అత్యంత శుభకరం అంతేకాకుండా ఈశాన్యం మూల బరువు లేకుండా చూసుకోవాలి.ఈశాన్య దిక్కుకు అధిపతి ఈశానుడు కాబట్టి దీనిని శుభ ఫలితములు ఇచ్చు స్థలము అని చెప్పవచ్చు.

మన పరిస్థితులు ఎలా ఉన్నా వాస్తు ప్రకారం మన ఇంటిని తీర్చిదిద్దవలసిన ధర్మం మన వైపు ఉంది.‌ ఇంటి గదిలో పశ్చిమ దక్షిణ గోడలకు ఆనిస్తూ ఎలాంటి బరువులు అయిన పెట్టవచ్చు అందువలన మంచి ఫలితాలు ఉంటాయి.  కానీ ఉత్తర తూర్పు దిక్కున గోడవైపు ఏ బరువు పెట్టకూడదు ఇలా పెడితే మంచి ఫలితాలు కలగటం అటుంచి చెడు ఫలితాలు కలుగుతాయి. అన్ని దిక్కుల కంటే కూడా నైరుతి మూలన ఎంత బరువు వేస్తే అంత మంచిది.

 

Please share it

Leave a Comment