Govinda namalu in telugu – గోవింద నామాలు

YouTube Subscribe
Please share it
4.4/5 - (7 votes)

Govinda namalu in telugu

కోరకలు తీర్చు కొంగు బంగారం శ్రీ తిరుమల వెంకటేస్వరుడు. నిత్యమూ ఉదయమే నిద్ర లేచి ఈ నామాలు ఎవరైతే చదువుతారో వారు వారి నిత్య కార్యక్రమాలలో సాఫల్యత సాదిస్తారు.గోవిందుడంటే కృష్ణుడనే అర్థం చాలామందికి తెలిసిందే.కాని ఆ పేరు రావడానికి కారణం ఆసక్తికరం. ఉత్తరదేశంలో మధురా నగరానికి సమీపంలో గోవర్ధనగిరి ఇప్పటికీ వుంది. ఇంద్రుడు కోపం వచ్చి గోగణాల మీద శిలలతో కూడిన పెను వర్షాన్ని కురిపిస్తే, కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి, దానికింద గోవులకుఆశ్రయం కల్పించాడు. ఇంద్రుడు కృష్ణుడి శక్తిని తెలుసుకొని, అతడితో స్నేహాన్ని కోరి, గోగణాలకు కృష్ణుడిని అధిపతి గావిం చాడు. నాటి నుండి శ్రీకృష్ణుడు ‘గోవిందుడ’య్యాడని ఐతిహ్యం.

శ్రీ శ్రీనివాసా గోవిందా 

శ్రీ వేంకటేశా గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

భక్తవత్సలా గోవిందా 

భాగవతప్రియ గోవిందా..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

నిత్యనిర్మలా గోవిందా 

నీలమేఘశ్యామ గోవిందా.. 

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

పురాణపురుషా గోవిందా 

పుండరీకాక్ష గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

నందనందనా గోవిందా 

నవనీతచోర గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

పశుపాలక శ్రీ గోవిందా 

పాపవిమోచన గోవిందా.. 

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

దుష్టసంహార గోవిందా 

దురితనివారణ గోవిందా.. 

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

శిష్టపరిపాలక గోవిందా 

కష్టనివారణ గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

వజ్రమకుటధర గోవిందా 

వరాహమూర్తి గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

గోపీ లోల గోవిందా 

గోవర్ధనోద్ధార గోవిందా.. 

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

దశరథనందన గోవిందా 

దశముఖమర్దన గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

పక్షివాహన గోవిందా 

పాండవప్రియ గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

మధుసూదన హరి గోవిందా 

మహిమ స్వరూప గోవింద ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

వేణుగానప్రియ గోవిందా 

వేంకటరమణా గోవిందా.. 

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

సీతానాయక గోవిందా 

శ్రితపరిపాలక గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

అనాథరక్షక గోవిందా 

ఆపద్బాంధవ గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

శరణాగతవత్సల గోవిందా 

కరుణాసాగర గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

కమలదళాక్ష గోవిందా 

కామితఫలదా గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

పాపవినాశక గోవిందా 

పాహి మురారే గోవిందా.. 

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా..

శ్రీముద్రాంకిత గోవిందా 

శ్రీవత్సాంకిత గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా..

ధరణీనాయక గోవిందా 

దినకరతేజా గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

పద్మావతిప్రియ గోవిందా 

ప్రసన్నమూర్తీ గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా..

అభయ మూర్తి గోవింద ..

ఆశ్రీత వరద గోవిందా 

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

శంఖచక్రధర గోవిందా 

శార్ఙ్గగదాధర గోవిందా.. 

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

విరజాతీర్థస్థ గోవిందా 

విరోధిమర్దన గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

సాలగ్రామధర గోవిందా 

సహస్రనామా గోవిందా.. 

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

లక్ష్మీవల్లభ గోవిందా 

లక్ష్మణాగ్రజ గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

కస్తూరితిలక గోవిందా 

కాంచనాంబర గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

వానరసేవిత గోవిందా 

వారధిబంధన గోవిందా..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

అన్నదాన ప్రియ గోవిందా 

అన్నమయ్య వినుత గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

ఆశ్రీత రక్షా గోవింద

అనంత వినుత గోవిందా..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

ధర్మసంస్థాపక గోవిందా

ధనలక్ష్మి ప్రియ గోవిందా ..

గోవిందా హరి గోవిందా

గోకులనందన గోవిందా..

ఏక స్వరూపా గోవింద 

లోక రక్షకా గోవింద..

గోవిందా హరి గోవిందా

గోకులనందన గోవిందా..

వెంగమాంబనుత గోవిందా

వేదాచలస్థిత గోవిందా..

గోవిందా హరి గోవిందా

గోకులనందన గోవిందా.. 

రామకృష్ణా హరి గోవిందా 

రఘుకులనందన గోవిందా.. 

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

వజ్రకవచధర గోవిందా 

వసుదేవ తనయ గోవిందా.. 

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

బిల్వపత్రార్చిత గోవిందా 

భిక్షుకసంస్తుత గోవిందా.. 

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా..

బ్రహ్మాండరూపా గోవిందా 

భక్తరక్షక గోవిందా.. 

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

నిత్యకళ్యాణ గోవిందా 

నీరజనాభ గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

హథీరామప్రియ గోవిందా 

హరిసర్వోత్తమ గోవిందా.. 

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

జనార్దనమూర్తి గోవిందా 

జగత్సాక్షిరూప గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

అభిషేకప్రియ గోవిందా 

ఆపన్నివారణ గోవిందా.. 

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

రత్నకిరీటా గోవిందా 

రామానుజనుత గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

స్వయంప్రకాశా గోవిందా 

సర్వకారణ గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

నిత్యశుభప్రద గోవిందా 

నిఖిలలోకేశ గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

ఆనందరూపా గోవిందా 

ఆద్యంతరహితా గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

ఇహపరదాయక గోవిందా 

ఇభరాజరక్షక గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

గరుడాద్రి వాసా గోవింద 

నీలాద్రి నిలయా గోవింద ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

అంజనీద్రీస గోవింద 

వృషభాద్రి వాసా గోవిందా ..

గోవిందా హరి గోవిందా

గోకులనందన గోవిందా.. 

తిరుమలవాసా గోవిందా

తులసీమాల గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా..

శేషాద్రినిలయా గోవిందా 

శ్రేయోదాయక గోవిందా.. 

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

పరమదయాళో గోవిందా 

పద్మనాభహరి గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

గరుడవాహన గోవిందా 

గజరాజరక్షక గోవిందా.. 

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

సప్తగిరీశా గోవిందా 

ఏకస్వరూపా గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

ప్రత్యక్షదేవా గోవిందా 

పరమదయాకర గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

వడ్డికాసులవాడ గోవిందా 

వసుదేవతనయా గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

స్త్రీపుంరూపా గోవిందా 

శివకేశవమూర్తి గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

శేషసాయినే గోవిందా 

శేషాద్రినిలయా గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

అన్నదాన ప్రియ గోవిందా 

ఆశ్రితరక్షా గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

వరాహ నరసింహ గోవిందా 

వామన భృగురామ గోవిందా.. 

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

బలరామానుజ గోవిందా 

బౌద్ధకల్కిధర గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

దరిద్రజనపోషక గోవిందా 

ధర్మసంస్థాపక గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా ..

వజ్రమకుటధర గోవిందా 

వైజయంతిమాల గోవిందా ..

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా.. 

శ్రీనివాస శ్రీ గోవిందా 

శ్రీ వేంకటేశా గోవిందా 

గోవిందా హరి గోవిందా 

గోకులనందన గోవిందా 

ఇతి శ్రీ వెంకటేశ్వర గోవింద నామావళి సంపూర్ణం.

Also read : శ్రీ విష్ణు సహస్ర నామసోత్రమ్

సత్యనారాయణ అష్టోత్తర శతనామావళిః

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

Please share it

3 thoughts on “Govinda namalu in telugu – గోవింద నామాలు”

Leave a Comment