Kondagattu lo Velasina Anjanna Song Lyrics in Telugu
కొండగట్టులో వెలసిన అంజన్న చాలా ప్రసిద్ధ జానపద భక్తి పాట, భారతదేశంలోని జగిత్యాల్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలోని ఆంజనేయస్వామి ని పూజిస్తారు’
కొండగట్టు లో వెలసిన అంజన్నా
| పల్లవి |
కొండగట్టు లో వెలసిన అంజన్నా
నీ అండా దండా మాకుండాలని,
కొబ్బరికాయలు, పూలూ పండ్లు,
పలహారాలు నీకు తెస్థిమయ్య (2)
| చరణం: 1 |
తడి బట్టలతో స్నానం చేసి,
వడివడిగా నీ గుడిలో కొచ్చి
రామ మంత్రమే పఠియించేము,
రామ దూతయని పూజించేము
కళ కళ లాడే ఓ అంజన్నా,
కరుణతో మమ్ము కాపాడ రావయ్య
కొండగట్టు లో వెలసిన అంజన్నా..
| చరణం: 2 |
నీ ముందేమో కోటి కోతులు
నీ చుట్టేమో కోటి భక్తులు
జిగేలు మన్న జిల్లేడు దండలు
పవిత్రమైన పత్తిరాకులు
గణ గణ నీ గుడి గంటలు కొట్టి
ఘనముగ నీకు పూజలు చేసేము అంజన్న
కొండగట్టు లో వెలసిన అంజన్నా..
| చరణం : 3 |
మెండైన నీ కొండను ఎక్కి,
దండిగా పూజలు చేసేమయ్య
నిన్ను తలువని కాయమెందుకు
నిన్ను కొలవని కరములెందుకు
బాహుబలవంత బ్రహ్మ స్వరూపా
బాధలు బాపగ వేగమే రావయ్యా
కొండగట్టు లో వెలసిన అంజన్నా..
| చరణం : 4 |
కొండగట్టుపై వెలసితివయ్యా,
దండి రాక్షసులగూల్చితివయ్యా
నీ గుడియందు గండ దీపము
నీ గుడి ముందు గరుడ స్తంభము
వేగా వేగామీ కొండకు వచ్చి
వేడుకలెన్నో చేసేము అంజన్నా ||
కొండగట్టు లో వెలసిన అంజన్నా..