Kondagattu lo Velasina Anjanna Song Lyrics in Telugu-కొండగట్టు లో వెలసిన

YouTube Subscribe
Please share it
Rate this post

Kondagattu lo Velasina Anjanna Song Lyrics in Telugu

కొండగట్టులో వెలసిన అంజన్న చాలా ప్రసిద్ధ జానపద భక్తి పాట, భారతదేశంలోని జగిత్యాల్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలోని ఆంజనేయస్వామి ని  పూజిస్తారు’

కొండగట్టు లో వెలసిన అంజన్నా

| పల్లవి |
కొండగట్టు లో వెలసిన అంజన్నా
నీ అండా దండా మాకుండాలని,
కొబ్బరికాయలు, పూలూ పండ్లు,
పలహారాలు నీకు తెస్థిమయ్య (2)

| చరణం: 1 |
తడి బట్టలతో స్నానం చేసి,
వడివడిగా నీ గుడిలో కొచ్చి
రామ మంత్రమే పఠియించేము,
రామ దూతయని పూజించేము
కళ కళ లాడే ఓ అంజన్నా,
కరుణతో మమ్ము కాపాడ రావయ్య

కొండగట్టు లో వెలసిన అంజన్నా..

| చరణం: 2 |
నీ ముందేమో కోటి కోతులు
నీ చుట్టేమో కోటి భక్తులు
జిగేలు మన్న జిల్లేడు దండలు
పవిత్రమైన పత్తిరాకులు
గణ గణ నీ గుడి గంటలు కొట్టి
ఘనముగ నీకు పూజలు చేసేము అంజన్న

కొండగట్టు లో వెలసిన అంజన్నా..

| చరణం : 3 |
మెండైన నీ కొండను ఎక్కి,
దండిగా పూజలు చేసేమయ్య
నిన్ను తలువని కాయమెందుకు
నిన్ను కొలవని కరములెందుకు
బాహుబలవంత బ్రహ్మ స్వరూపా
బాధలు బాపగ వేగమే రావయ్యా

కొండగట్టు లో వెలసిన అంజన్నా..

| చరణం : 4 |
కొండగట్టుపై వెలసితివయ్యా,
దండి రాక్షసులగూల్చితివయ్యా
నీ గుడియందు గండ దీపము
నీ గుడి ముందు గరుడ స్తంభము
వేగా వేగామీ కొండకు వచ్చి
వేడుకలెన్నో చేసేము అంజన్నా ||

కొండగట్టు లో వెలసిన అంజన్నా..

అయ్యా చదవండి:హనుమదష్టకం

Please share it

Leave a Comment