Matangi Stotram in Telugu – మాతంగీ స్తోత్రం

YouTube Subscribe
Please share it
Rate this post

Matangi Stotram in Telugu

Unlock the divine power of Sri Matangi Stotram with our Telugu Pdf Lyrics. Experience the enchanting verses and profound meaning of this sacred hymn. Download now to immerse yourself in the spiritual essence of Sri Matangi.

శ్రీ మాతంగీ స్తోత్రం

ఈశ్వర ఉవాచ |

ఆరాధ్య మాతశ్చరణాంబుజే తే
బ్రహ్మాదయో విస్తృత కీర్తిమాయుః |
అన్యే పరం వా విభవం మునీంద్రాః
పరాం శ్రియం భక్తి పరేణ చాన్యే || 1 ||

నమామి దేవీం నవచంద్రమౌళే-
ర్మాతంగినీ చంద్రకళావతంసాం |
ఆమ్నాయప్రాప్తి ప్రతిపాదితార్థం
ప్రబోధయంతీం ప్రియమాదరేణ || 2 ||

వినమ్రదేవస్థిరమౌళిరత్నైః
విరాజితం తే చరణారవిందం |
అకృత్రిమాణం వచసాం విశుక్లాం
పదాం పదం శిక్షితనూపురాభ్యామ్ || 3 ||

కృతార్థయంతీం పదవీం పదాభ్యాం
ఆస్ఫాలయంతీం కలవల్లకీం తాం |
మాతంగినీం సద్ధృదయాం ధినోమి
లీలాంశుకాం శుద్ధ నితంబబింబామ్ || 4 ||

తాలీదళేనార్పితకర్ణభూషాం
మాధ్వీమదోద్ఘూర్ణితనేత్రపద్మాం
ఘనస్తనీం శంభువధూం నమామి
తటిల్లతాకాంతిమనర్ఘ్యభూషామ్ || 5 ||

చిరేణ లక్ష్మ్యా నవరోమరాజ్యా
స్మరామి భక్త్యా జగతామధీశే |
వలిత్రయాఢ్యం తమ మధ్యమంబ
నీలోత్పలాం శుశ్రియమావహంతమ్ || 6 ||

కాంత్యా కటాక్షైః కమలాకరాణాం
కదంబమాలాంచితకేశపాశం |
మాతంగకన్యే హృది భావయామి
ధ్యాయేహమారక్తకపోలబింబమ్ || 7 ||

బింబాధరం న్యస్తలలామరమ్య-
మాలోలలీలాలకమాయతాక్షం |
మందస్మితం తే వదనం మహేశి
స్తువేన్వహం శంకర ధర్మపత్ని || 8 ||

మాతంగినీం వాగధిదేవతాం తాం
స్తువంతి యే భక్తియుతా మనుష్యాః |
పరాం శ్రియం నిత్యముపాశ్రయంతి
పరత్ర కైలాసతలే వసంతి || 9||

ఇతి శ్రీ మాతంగీ స్తోత్రం సంపూర్ణం ||

Also read : ఆదిత్య హృదయం

Please share it

2 thoughts on “Matangi Stotram in Telugu – మాతంగీ స్తోత్రం”

Leave a Comment