Nirvana Shatakam in Telugu | నిర్వాణ షట్కం

YouTube Subscribe
Please share it
Rate this post

Nirvana Shatakam in Telugu

Nirvana Shatakam is a song that talks about how we are all connected to everything in the world. It says that we are not just our bodies or our thoughts, but something much bigger. It reminds us that we are all made of love and peace, and we can find happiness by realizing this.

నిర్వాణ షట్కం

శివోహమ్ శివోహమ్ శివోహమ్

మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహమ్
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ || 1 || 

అర్థం: నేను మనస్సు కాదు,బుద్ధి కాదు, చిత్తము కాదు,అహంకారం కూడా కాదు. నేను పంచేంద్రియాలు కాదు. నేను పంచభూతాలు కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివున్ని. నేను శివుడిని.

న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుః
న వా సప్త ధాతుర్ న వా పంచ కోశః
న వాక్ పాణి పాదం న చోపస్థ పాయు
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ || 2 || 

అర్థం: నేను ప్రాణాన్ని కాదు. పంచవాయువులు నేను కాదు. సప్త ధాతువులు నేను కాదు. పంచకోశాలు నేను కాదు. కర్మేంద్రియాలు నేను కాదు.నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.

న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్య భావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ || 3 || 

అర్థం: నాలో రాగద్వేషములు లేవు,లోభమోహాలు లేవు. నాలో మదమాత్సర్యాలు లేవు. ధర్మార్ధకామమోక్షాలు నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఖఃమ్
న మంత్రో న తీర్థ న వేదా న యజ్ఞః
అహమ్ భోజనమ్ నైవ భొజ్యమ్ న భోక్త
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ || 4 || 

అర్థం: నాకు పుణ్యపాపాలు లేవు. నాకు సుఖదుఃఖాలు లేవు. మంత్రాలు,తీర్థాలు,వేదాలు,యజ్ఞాలు నేను కాదు. అనుభవించేవాన్ని నేను కాదు. అనుభవింపదగిన వస్తువు నేను కాదు. అనుభవం నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.

న మే మృత్యు శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మః
న బంధుర్ న మిత్రం గురుర్ నైవ శిష్యః
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ || 5 || 

అర్థం: నాకు జననమరణాలు లేవు. నాలో జాతి భేధాలు లేవు. నాకు తల్లిదండ్రులు లేరు. నాకు బంధుమిత్రులు లేరు. నాకు గురుశిష్యులు లేరు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.

అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం
న చాసంగత నైవ ముక్తిర్ న మేయః
చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ || 6 || 

అర్థం: నాలో మార్పులు లేవు. నాకు రూపం లేదు. నేను అంతటా ఉన్నాను. సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను. అన్నింటిలో సమానంగా ఉన్నాను. నాకు బంధమోక్షాలు లేవు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.

Also read:గాయత్రీ అష్టోత్తర శతనామావళిః 

Please share it

Leave a Comment