Sarpa Suktam – సర్ప సూక్తం
సర్పరూపుడైన సుబ్రమణ్య స్వామి, కుజునికి అధిష్టాన దైవం. అలాగే రాహు కి, సుబ్రహ్మణ్యస్వామి సర్ప మంత్రాలకు అధిష్ఠాన దైవాలు. అలాగే కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి పూజ సర్ప పూజలు చేయాలి.
మానవుని జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తిని ధైర్యాన్ని ఇస్తాడు అందువలన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్ప రూపుడు కావున సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్యస్వామి ఆధీనంలో ఉంటాయి.అందువలన సుబ్రహ్మణ్య ఆరాధనం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వల్ల సర్ప, కేతు గ్రహ దోషాలు కూడా పరిహారం జరుగుతుంది.
మంగళవారం లేదా శుద్ధ షష్టి, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలసిన రోజైనా కుజుడికి, సుబ్రహ్మణ్యేశ్వరుని కి ప్రీతికరము. ఆరోజున కుజ మంత్రం జపించాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర మంత్రం జపించాలి తరువాత సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తరశతనామావళి తో పూజ చేయాలి. ఇలా తొమ్మిది రోజులపాటు నిష్టగా జపము పూజచేసి చంద్ర లేదా మోదక పూలతో నెయ్యి తేనెలతో తొమ్మిది సార్లు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే చాలా మంచిదని చెబుతారు దీనివలన కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ పూజ అనంతరం సర్పసూక్తం లేదా సర్ప మంత్రాలు చదవడం వల్ల ఇంకా మేలు జరుగుతుంది.
జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు, అన్ని విధాలా దోష పరిహారం జరుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కావున స్వామికి మొక్కుకున్న వారికి తన రూపంలో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్మకం. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని మహిళలు పూజలు చేయడం తరచుగా మనం చూస్తూ ఉంటాం.
అలాగే సంతాన ప్రాప్తిని కోరి మహిళలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య కేతు మంత్రాలతో ఇరవై ఒక్కసార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని, పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టూ ఇరవై ఒక్క లేదా 108 సార్లు లేదా మండలం పాటు అనగా 40 రోజుల పాటు ప్రదక్షణాలు చేస్తే సుబ్రహ్మణ్య అనుగ్రహం కలిగి సర్వ దుఖాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.
నమో॑ అస్తు స॒ర్పేభ్యో॒ యే కే చ॑ పృథి॒వీ మను॑ |
యే అ॒న్తరి॑క్షే॒ యే ది॒వి తేభ్య॑: స॒ర్పేభ్యో॒ నమ॑: |
యే॑ఽదో రో॑చ॒నే ది॒వో యే వా॒ సూర్య॑స్య ర॒శ్మిషు॑ |
యేషా॑మ॒ప్సు సద॑: కృ॒తం తేభ్య॑: స॒ర్పేభ్యో॒ నమ॑: |
యా ఇష॑వో యాతు॒ధానా॑నా॒o యే వా॒ వన॒స్పతీ॒గ్॒o రను॑ |
యే వా॑ఽవ॒టేషు॒ శేర॑తే॒ తేభ్య॑: స॒ర్పేభ్యో॒ నమ॑: |
ఇ॒దగ్ం స॒ర్పేభ్యో॑ హ॒విర॑స్తు॒ జుష్టమ్” |
ఆ॒శ్రే॒షా యేషా॑మను॒యన్తి॒ చేత॑: |
యే అ॒oతరి॑క్షం పృథి॒వీం క్షి॒యన్తి॑ |
తే న॑స్స॒ర్పాసో॒ హవ॒మాగ॑మిష్ఠాః |
యే రో॑చ॒నే సూర్య॒స్యాపి॑ స॒ర్పాః |
యే దివ॑o దే॒వీమను॑స॒న్చర॑న్తి |
యేషా॑మాశ్రే॒షా అ॑ను॒యన్తి॒ కామమ్” |
తేభ్య॑స్స॒ర్పేభ్యో॒ మధు॑మజ్జుహోమి || ౨ ||
ని॒ఘృష్వై॑రస॒మాయు॑తైః |
కాలైర్హరిత్వ॑మాప॒న్నైః |
ఇంద్రాయా॑హి స॒హస్ర॑యుక్ |
అ॒గ్నిర్వి॒భ్రాష్టి॑వసనః |
వా॒యుశ్వేత॑సికద్రు॒కః |
స॒oవ॒థ్స॒రో వి॑షూ॒వర్ణై”: |
నిత్యా॒స్తేఽనుచ॑రాస్త॒వ |
సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సు॑బ్రహ్మణ్యోగ్ం ||
||ఓం శాంతిః శాంతిః శాంతిః ||
వీటిని కూడా చదవండి : దేవి ఖడ్గమాలా స్తోత్రం
: శ్రీ హానుమాన్ బడబానల స్త్రోత్రం
: శ్రీ లలితా సహస్త్ర నామ స్తోత్రం
ఈ దేవాలయం దర్శించండి : శ్రీ కదిరి లక్ష్మి నరసింహ దేవాలయం
Veda swaras are wrong. Please check once again. Swaras are shifted to next letter, which is wrong.
19.6.2022
Dr. M.B.S. S. Narayana
Sanskrit Department
SSSIHL
సర్ప సూక్తమ్
నమో అస్తు సర్వేభ్యోయే కేచ పృథివీమను | మీ అత్తరిక్షే యే దివి తేభ్యః సర్వేభ్యో నమః ॥
సర్పములకు నమస్కారము. ఈ పృథివియందు అంతరిక్షమునందు, స్వర్గమునందు ఏ సర్పములైతే కలవో వాటికి నమస్కారము.
Salutations to the Serpents, which are on the Earth, in the atmosphere, in the (Sky) haven, To those serpents homage.
2) యేsధో రోచనే దివో యేవా సూర్యస్య రష్మిషు
యేషామప్సు సదః కృతం తేభ్యః సర్వేభ్యో నమః |
భావము – అధోలోకములందు, స్వర్గమునందు, సూర్య కిరణములందు, నీటియందు నివాసమును కల్పించుకున్న ఏ సర్పములైతే ఉన్నాయో, వాటికి నమస్కారము.
To those serpents which are staying in Rasatala, in the heaven, in the
sun rays, in waters, for those serperts (my) salutations.
3) యా ఇషవో యాతుధానానాం
యేవా వనస్పతీగ్ం రను ||
యే వాsవటేషు శేరతే తేభ్యః సర్వేభ్యో నమః
భావము-
అసురుల చేత అస్త్రములుగా ప్రయోగింపబడునవి, వృక్ష సమూహాలలో నివసించునవి, నీటి బావులలో నిద్రించునవి అయిన ఏ సర్పములైతే ఉన్నాయో వాటికి నమస్కారము.
Those which are used as weapons in the hands of Asuras, living among the trees, that lie in the walls to those serpents honour.
4) ఇదగ్ం సర్పేభ్యో హవిరస్తు జుష్టమ్ | ఆశ్రేషా యేషామను యన్తి చేతః ।
యే అంతరిక్షం పృధివీం క్షియన్తి |
తే నస్సర్పాసో హవమాగమిష్ఠాః !
యే రోచనే సూర్యస్వాపి సర్పాః |
యేదివం దేవీమనుసన్చరన్తి |
యేషామాశ్రేషా అనుయన్తి కామమ్ | తేభ్యస్వర్పేభ్యో మధుమజ్జుహోమి||
భావము-
ఈ సర్పములకు ప్రీతికరమైన హవిస్సు అందునుగాక. ఆశ్రేషా నక్షత్రమును ఆశ్రయించిన మరియు సూర్యుని అధీనంలోని సర్పములు, స్వర్గలోక స్త్రీలను/దేవతలను అనుసరించునవి. ఆశ్రేషానక్షత్రముకు ఇష్టమైనది కలిగించునవి అయిన ఆ సర్పములు మా బుద్ధులను పాలించునుగాక / రక్షించును గాక. ఆ సర్పములకు మధువును (తేనెను) సమర్పించి హోమము చేయుచున్నాను.
May this oblation be agreeable to the Serpents, the Airesha of those, then follow the mind, those who rule the atmosphere. and this earth, those are coming the quickest to the oblation for us from the place of the Serpents,
Moreover those who are spended serpents of the Sun and accordingly those who go to the gooders in heaven. The Asresha of those follow desire. Possessed of honey. I make offerings to those Serpents.
5) నిఘృష్వెరసమాయుతైః|
కాలైర్హరిత్వమాపన్నైః||
ఇంద్రాయాహి సహస్రయుక్ |
అగ్నిర్విభ్రాష్టివసనః |
వాయుశ్వేతసికద్రుకః| సంవత్సరోవిఘావర్ణైః| నిత్యా స్తే sనుచరాస్తవ |
సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం.
భావము-
ఓ సహస్ర నేత్రములు కల ఇంద్రా! (మేధాతిధి కొరకు మేక రూపమును పొందిన ఓ దేవా! ప్రసన్వస కూతురును వరించు ఓ దేవా !) కాలమునకు అధినులైన దేవతలతో, ప్రకాశవంతమైన వస్త్రములను ధరించిన అగ్ని దేవునితోనూ, తెల్లటి వాయువుతోనూ, సంవత్సర దేవునితోనూ నిరంతరం సన్నిహితుగా మెలిగే దేవతలతో కూడి నాకు ప్రత్యక్షమగుదువు గాక /నన్ను అనుగ్రహింతువు గాక. ఓం ఓం ఓం. (సుబ్రహ్మణ్యోగ్ం…)
oh Indra, one who is thousand eyed, oh, ruler of Devatas, who is along with effulgent and not united and have the form of horses (Time honored devatas), manifest before me, along with Agni with shining garments, Vaayu like white sand and Samvatsara deva, ever wonder closely with you. om Subrahmanya..(Brahman)
ఓ.. శాంతి: శాంతి: శాంతిః
Dr. M. B.S.S. Nanayana
Very greatest No words Sir
Wonderful great no Wourds Sir
Very good matter.