Mithuna Rasi / gemini zodiac sign in telugu – Hidden Secrets

YouTube Subscribe
Please share it
4.8/5 - (5 votes)

Mithuna Rasi – మిధున రాశి

మృగశిర 3 4 పాదములు,

ఆరుద్ర 1 2 3 4 పాదములు

పునర్వసు 1 2 3 పాదాలు, ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు మిధున రాశికి చెందుతారు.

Mithuna Rasi

దంపతులు ఈ రాశికి చిహ్నము గా శాస్త్రములందు చెప్పబడియున్నది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయు తత్వ రాశి. సన్నని పాదాలు నిశిత మైనటువంటి దృష్టి కలిగి ఉంటారు. వీళ్ళు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరులు అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు.

ఈ మిధున రాశి  వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయస్సు కనిపించనీయని యువ కళ వీరిలో ఉండును. వార్ధక్యము వచ్చువరకు వీరు చిన్నవారి వలే కనిపించరు. వీరు పొడవుగా, నిటారైన దేహం, ఆజానుబాహు తత్వం,

మిధున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి.ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూ నే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు.ఎవరినీ నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తారు. వీరికి కళలపై ఆసక్తి ఉంటుంది అల్పసంతోషి అని వీరిని చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోష పరుస్తారు.చక్కని వాగ్ధాటి ఉంటుంది అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది.ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ ప్రారంభించరువీరికున్న చంచల స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు.

మిధున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు.అదే విధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్నదాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమ శైలిలో పరిష్కరిస్తారు.వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిచిస్తారు. ఏ విషయాన్ని ఐనా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్లలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మిధున రాశి వారు, వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతారు. ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది వీళ్లలో. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు.తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి తమ జీవితంలో ఉపయోగపడుతుంది.ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన ఇబ్బందులు పడతారు.ఎప్పుడు చూసినా తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఒక వేళ అలా గతాన్ని ఆలోచించుకుండా ఉంటే ఉన్నత స్థితికి వస్తారు

ఈ రాశివారు అనవసర విషయములు గురించి ఎక్కువగా ఆలోచించుట వలన మానసిక వ్యధ నిద్రపట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పని అప్పగించరు , అందువలన మీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు.

తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్ట నీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభముగా గ్రహించసద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గం శిక్షణ ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవ్వరినీ నమ్మరు.

ఇక వ్యాపారానికి విషయానికి వస్తే వృత్తి మార్పిడి వ్యాపారములు వీరు మంచి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారములను చక్కదిద్దుటకు తన చాతుర్యముతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార తంతి తపాలా శాఖలు, ముద్రణాలయం లో టైపు, షార్ట్ హ్యాండ్ సంబంధించిన వృత్తులు యందు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేయుట, అనువాదము చేయుట, పత్రికలలో రచనలు చేయుట, యందు వీరు నేర్పరులు. సెక్రెటరీ, రాయభారము, దౌత్యం వృత్తులలో వీరు బాగా రాణిస్తారు.

ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందువలన వీరికి ధనము గురించి చింత, భవిష్యత్తు గురించి చింత ఉంటుంది.

మిధున రాశి వారికి స్త్రీ పురుష సంబంధం వ్యామోహము వీరికి తక్కువ. ప్రేమ ఒక్కరితోనూ వివాహము మరియొక తోనూ వీరి జీవితంలో జరగవచ్చును. అయినప్పటికీ వీరి విషయములో ఎవరికీ తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహము తో పాటుగా ఐశ్వర్యము కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామి ని నమ్మి హృదయమును సమర్పించుట జరగవలెను.

ఎదుటివారిని బట్టి స్వభావమును మార్చు కొనుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకొనుటలో, మంచి చెడ్డలను విమర్శించుటలో, వీరికి వీరే సాటి. మిధున రాశి వారు కాలమును, ధనమును వ్యక్తుల సామర్ధ్యములను అర్థవంతంగా వినియోగించగలరు. పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరచుట యందు చక్కటి నైపుణ్యం ఉండును. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయటం కన్నా సంస్థలకు సహాయం చేయట వీరికి విశ్వాసం ఎక్కువ.

ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యము ఉంటుంది. సంగీతము నందు మంచి నైపుణ్యం ఉంటుంది. వీణ లాంటి తంత్రి వాయిద్యములు లో మంచి నైపుణ్యం ఉంటుంది. అలాగే శిల్పా చిత్రలేఖనము కుట్టుపని అల్లికపని గృహోపకరణాల అలంకరణ ములు యందు చక్కటి ప్రావీణ్యం ఉంటుంది. అలాగే పూల మొక్కలు కూరగాయలు పెంచుట లో ప్రత్యేక కౌశలం కూడా ఉంటుంది. 

ఇక మిధున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మిధున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు. ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ గౌరవం విలువ ఇస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు కలవారు, అలాగే జాలి దయ కలవారు అవతలి వారి కష్టసుఖాలు గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు అవతలి వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతారు. ఉదాహరణకు విరి స్నేహితులు ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా వారికి ఇవ్వటానికి వీరు ఏ మాత్రం వెనకాడరు. అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తారు. వీరు ఒక పని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు. దాన్ని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు. వీరుకున్న నైపుణ్యాలు స్కిల్స్ ఇంకెవ్వరికీ ఉండవు. అంతటి నైపుణ్యం వీరికుంటుంది. ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా కూడా  వీరికి సందేహం అధికంగా ఉంటుంది ఆ పని చేయొచ్చా చేయకూడదా? ఆ పని చేస్తే ఏమవుతుంది చేయకుంటే ఏమవుతుంది ఇలా ఏ పని చేసినా వీరికో ఒక సందేహం ఒకంత భయం ఉంటుంది.

వీరు భిన్నాభిప్రాయాలు కలవారు అలాగే రెండు రకాలుగా వ్యవహరిస్తుంటారు ఒక నిర్ణయం తీసుకుంటారు. మళ్లీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఇలా రెండు రకాలుగా కనిపిస్తుంటారు. వీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువ విలువని ఇవ్వటం వల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు, ఉదాహరణకు వీరికి ఉన్నత చదువులు చదవాలని ఆశ కోరిక ఉంటుంది, కానీ కుటుంబ సభ్యులు అలాగే దూరపు బంధువులు సలహాలు అభిప్రాయం మేరకు చదువు లేదా చేస్తున్న ఉద్యోగం అక్కడే ఆపేస్తారు. దీని వలన వీరు జీవితంలో నష్టపోతారు. అలాగే అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశ పడతారు కాని కుటుంభ  సభ్యుల విలువకు గౌరవాన్ని ఇస్తారు. అలాగే వీరు ఏ విషయంలోనైనా కంగారుగా, భయంగా ఉంటారు .కానీ దీన్ని వీరు బయటపడనివ్వరు.

ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాసరచన, రైటింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి. అలాగే జర్నలిజం రంగంలో రాణిస్తారు. వీరు మీడియా రంగంలో కూడా వీరు రాణిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు న్యాయబద్దంగా ఉంటారు. నీతి న్యాయ ధర్మాల వైపు ఆ దిశగా ఎదగాలని అనుకుంటారు .నీతి న్యాయ ధర్మాల్లో మధ్యవర్తులుగా ఉండి న్యాయం వైపు తీర్పులిస్తారు. న్యాయాన్ని సపోర్ట్ చేస్తారు. వీరికి మంచి వాక్చతుర్యం ఉంటుంది. వీరి దగ్గర  ఎంత డబ్బున్నా జీవితంలో ఏదో అసంతృప్తి ఉంటుంది.

వీరికి లలిత కలలు సంగీతం అంటే అభిరుచి ఎక్కువగా ఉంటాయి. కానీ మిధున రాశిలో జన్మించిన స్త్రీలకు వీరి సంతానానికి మధ్య భేదాప్రియాలు ఉంటాయి. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ధనాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు. ధనాన్ని కూడా పెట్టి పెద్ద పెద్ద వస్తువుల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తఋ అలాగే కొన్ని సందర్భాల్లో స్నేహితులని నమ్మి పెట్టుబడి పెట్టి నష్టపోయిన సందర్భాలు కూడా వీరుకుంటాయి మీరు మాటకారులు మాటల్లో చమత్కారం ఎక్కువగా వుంటుంది. మీరు మాట్లాడటానికి అవతల వారికి అవకాశం ఇవ్వరు. మీరే మాట్లాడుతూ ఉంటారు అంత మాటకారులు వీరు. అయితే వీరు ప్రతి విషయాన్నిబూతఅద్దంలోచూస్తారు ఎదుటివారు ఒక ఉద్దేశంతో మాట్లాడితే వీరు ఇంకోలా అర్థం చేసుకుంటారు. దీని వల్ల జీవితంలో వచ్చిన అవకాశాల్ని  విడిచి పెట్టుకుంటారు కూడా దీనివలన జీవితంలో వచ్చిన అవకాశాలు విడిచి పెట్టేస్తారు .ఇతరుల విషయంలో మధ్యవర్తిత్వం చేస్తుంటారు దీని వలన వీరు ఎక్కువగా నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు ఒకే సమయంలో ఇద్దరు స్త్రీలతో గడిపితే ఎలా ఉంటుందో అది మిధున రాశి స్త్రీతో ఉంటుంది. మిధున రాశి  స్త్రీ తెలివితేటలకు ఎదుటి వ్యక్తులు ఆకర్షితులు అవుతారు. ఈ రాశి లో జన్మించిన స్త్రీ ఒక్క క్షణం నవ్వుతూ చిన్నపిల్లల నవ్వుతూ తులతూ కనిపిస్తుంది. మరుక్షణమే బాధ్యతగల గృహనిలా గంభీరంగా కనిపిస్తుంది. ఆ వెంటనే తన తెలివితేటలకు వేదాంతపరమైన విషయాల మీద దృష్టి పెడుతుంది. తన భావాలు వివరించగలుగుతుంది .రాజకీయ విషయాలు మీద చర్చిస్తుంది మరో నిమిషంలోనే ఉద్వేగా పూర్వకంగా సెంటిమెంటల్ గా కన్నీళ్ళతో భయంగా కనపడుతుంది. అందుకే ఈమె ఎప్పుడు నిత్య నూతనంగా కనపడుతుంది .తప్ప రొటీన్ గా కనిపించదు. వీరితో సాన్హిత్యం అస్సలు బోర్ కొట్టదు అలాగే ఈమె ఎదుటివారిని ఎవరైనా ఇష్టపడుతున్న లేదా తన జీవిత భాగస్వామి అయినా సరే తన అందం తెలివి వినయ విధేయతలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి.

ఈమి ఒక్క చూపుతో తన జీవిత భాగస్వామిని గాని, ప్రియుడిని కానీ తనకు ఇష్టమైన వారిని కానీ, తమ కాళ్ళ దగ్గరకు రప్పించాల్సిందే. ఇక మిధున రాశి గల స్త్రీ ఎంత సున్నితంగా ఉంటుందో అంత సున్నితంగా వీరి ఆలోచనలు ఉంటాయి. మీరు పైకి ఏమీ తెలియనట్టుగానే వుంటారు కానీ అన్ని గమనిస్తూ సున్నితంగా ఆలోచిస్తుంటారు. ఈమి తన ప్రేమలో పడ్డారని ఎంత బలంగా విశ్వసిస్తుందో అలాగే ఇతర పురుషుల పట్ల ఆకర్షిస్తుండటం కూడా గుర్తిస్తుంది. ఈ రాశి గల స్త్రీ ఎప్పుడూ తనకి ఇష్టమైన నచ్చిన వ్యక్తులతో ఉండాలని వారితో సమయాన్ని గడపాలని అనుకుంటుంది ఉదాహరణకు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపాలని అనుకుంటుంది. తన ప్రేమ గౌరవం, విలువ మర్యాదలు, అన్ని జీవిత భాగస్వామికి అర్పిస్తుంది కానీ జీవితం అనుకుంటుంది. కానీ జీవిత భాగస్వామి కూడా వారికి సమయాన్ని కేటాయించాలి

 మీరు ఇంటికి వచ్చిన అతిథుంటే ఎంతో అభిమానం గా ఆతిథ్యం ఇస్తారు. అలాగే ఈ రాశులు పుట్టిన స్త్రీ పరిపూర్ణ స్త్రీ తత్వం ప్రదర్శిస్తుంది. ఎంత చిన్న ఇంటి నైనా చాలా చక్కగా అలంకరించుకుంటుంది అంతటి ప్రతిపా పాఠాలు ఈ రాసి లో జన్మించిన స్త్రీలకు ఉంటాయి అలాగే ఈ రాశులు జన్మించిన స్త్రీలు పిల్లలకి మంచి నడవడిక నేర్పుతారు. వీరిని ప్రేమగా లాలించి పాలించి బుజ్జగించి వారి భవిష్యత్తు కోసం తన వంతు పాత్ర బాధ్యతగా వ్యవహరిస్తుంది

ఎర్రని నేత్రములు, పాండిత్యము రాయబారం చేసే సామర్థ్యం అందమైన రింగులు తిరిగినటువంటి వెంట్రుకలు కలిగినటువంటి శిరస్సు ,బుద్ధి చేతరత , చక్కగా హాస్య ప్రియత్వము అందమైనటువంటి శరీర అవయవ పుష్టి, ప్రియభాషణము, సంగీత ప్రియులు నాట్య ప్రియులు నాట్యాన్ని తెలిసినవారు ఈ విధంగా విశేషమైనటువంటి శుభాలు ఉన్నాయని మనకి శాస్త్ర వచనములో చెప్పబడింది. అలాగే ఇంకా వివిధ గ్రంథాల సారాంశం ఎలా ఉందో చూద్దాం. ఈ జాతకులు కుశాగ్ర బుద్ధి కలవారు విద్యల పట్ల పట్టు సాధించడం అలాగే విద్యల పట్ల విశేషమైన ఆకర్షణ విద్యా తత్పరులు, మేధాశక్తి సంభాషణ చాతుర్యం, మస్తిష్క ప్రధానలు మెదడులో ఒకటికి బదులు రెండు మస్తిష్కాలు పనిచేస్తుంటే ఒకేకాలంలో రెండు విధాలుగా పనిచేయగలనటువంటి అష్టావధాన సిద్ధి ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఊహల్లో ఉంటారు ఆ ఊహని నిజం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. వీరు చేసే ఊహ చాలా శక్తిమంతంగా నిజానికి దగ్గరగా ఉంటుంది.ద్వంద స్వభావము కలిగి వుంటారు గంభీర చిత్తులే ఉంటారు, అయితే ఒకసారి చంచలత్వం కూడా అవహిస్తూ ఉంటుంది వాక్ ప్రభావం విశేషంగా ఉంటుంది స్పష్టమైన ఉచ్చారణ అర్ధమయ్యేలా మాట్లాడడం బహు భాష ప్రజ్ఞ ,వాక్పటుత్వం సంభాషణలో నైపుణ్యం, కౌశల్యం మాట్లాడే శైలి హుందాగా ఉంటుంది. ప్రజలను ప్రభావితం చేయగలుగుతారు. అనేక విషయాల్లో అభివృద్ధి ప్రపంచంలో అన్ని తెలుసుకోవాలని ఆకర్షణ, జ్ఞానము తర్వాత ఆశయ సాధనలో విజ్ఞాన పరంగా ముందుకు వెళతారు. జ్ఞానము విజ్ఞాన సమంగాఉంటాయి. అత్యంత చతురత కలిగి చేసే పనుల్లో చాలా బహుకాలం ఉండేటటువంటి పనులు చేస్తారు. అనేక సామాజికపరమైనటువంటి పనులు చేస్తారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో గుర్తింపును సాధిస్తారు. బుద్ధి చేతురత బాగుంటుంది .సంగీతం నృత్య కావ్యాధులలో అభిరుచి ఉంటుంది స్వయంగా విమర్శ చేసుకుంటూ తన వ్యక్తిత్వాన్ని తానే పునః పరిశీలన చేసుకుంటూ, తనలోని లోపాలని సర్దుకుంటూ పదిమందికి ఆదర్శవంతులుగా నిలుస్తూ ఉంటారు. ఆరంభంలో ఉన్న శ్రద్ధ పని పూర్తయ్యేంత వరకు ఉండదు.

నలుపు ఎరుపు కలిగినటువంటి మిశ్రమమైన శరీరవర్ణంలో ఎక్కువమంది పుడతారు. నేత్రాలు సుందరంగా ఉంటాయి. అలాగే గోధుమ వర్ణంలో కానీ చామన చాయ రంగులో గాని వుండే అవకాసం వుంటుంది.పొడవన ముక్కు, ఉంగరాల జుట్టు వుంటుంది.

ఒక్కోసారి బద్ధకం కూడా ఎక్కువ ఆవహిస్తూ ఉంటుంది, శాస్త్రజ్ఞులు తీక్షణమైన బుద్ధి మేధాతనము కావ్య సృజనాత్మక శక్తి హాస్య ప్రయత్నం అధ్యయనశీలులు, పుస్తక ప్రియులు కౌసల్యము యాజవాదము అలాగే మీడియా ఇలాంటి వాటిలోనూ కూడా వృద్ధి చెందుతూ ఉంటారు సందేశాలను పంపటంలో చెప్పటంలో విశేషమైనటువంటి ప్రజ్ఞాపాటవాలు చిన్నమాట కూడా కోపం తెచ్చుకొని స్వభావం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లల్లాగా అలుగుతుంటారు. ఆటలలో బుద్ధికి సంబంధించినటువంటి చదరంగము ఇట్లాంటి వాటిల్లో బాగా చురుగ్గా ఉంటారు. స్నేహం ఎక్కువ స్నేహం చేయాలని అభిలాష బాగా ఉంటుంది. బాల్యంలో ఎక్కువగా సుఖపడుతుంటారు, ఎక్కువ మంది చేత చిన్నతనంలో అభిమానాన్ని పొందుతారు విద్యలలో మేటి ఎస్ఎస్సి ధనవంతులు శ్రేష్టమైనటువంటి జ్ఞానము సర్వ ప్రియత్వము అందరి చేత ప్రేమింపబడటం చూడండి ఎన్ని మంచి విషయాలు చెబుతున్నారు కొన్ని సందర్భాల్లో ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలుంటే కుశాక్రమైన బుద్ధి జ్ఞాన విజ్ఞానాన్ని ఎక్కువ కాలం దాచుకొని అందరికీ తోటి వారి యొక్క సలహాలు కూడా అవసరమవుతుంటే.

ఈ జాతకులు మధ్యస్తమైన పొడుగు కలిగి ఉంటారు. కాళు చేతులు పొడవుగా ఉంటాయి. సుందర మైన నేత్రాలు . దవడలు చెక్కిళ్ళు బాగా బలంగా ఉంటాయి.అందముగా ఉంటాయి. విశాలమైన ముఖ వర్చస్స్సు గోచరిస్తాయి.

మిధున రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. మిధున రాశి మృగశిర నక్షత్రంలో జన్మించినవారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్ట ముఖి రుద్రాక్షను ధరించాలి. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ఇలా ధరించుట వలన శుభఫలితాలను పొందుతారు.

మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ధరించాలి. ఈ పగడమును వెండి లో ఉంగరపు వేలుకు ధరించాలి. ఒక మంగళవారంనాడు సుబ్రహ్మణ్యస్వామికి అష్టోత్తర శతనామావళి పూజ చేసి పగడమును ధరించండి కందులు దానం ఇవ్వాలి.

ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు గోమేధికమును ధరించాలి. ఈ గోమేధికమును మధ్యవలుకు బంగారములో ధరించాలి. మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములు దానం ఇవ్వాలి.

పునర్వసు నక్షత్రం లో జన్మించిన వారు కనకపుష్యరాగం ధరించాలి. చూపుడు వేలుకు బంగారములో ధరించాలి. గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తరువాత  శెనగలు దానం ఇవ్వాలి. ఇలా చెయ్యటం వలన శుభ పలితాలు కలుగుతాయి. మిధున రాశి వారికి శుభం కలుగుగాక.

 

 

Please share it

Leave a Comment