Tula rashi telugu / Libra Sign – Nature Hidden Secrets

YouTube Subscribe
Please share it

Tula rashi telugu – తులా రాశి

చిత్త 3, 4 పాదములు

స్వాతి 1 ,2, 3, 4 పాదములు

విశాఖ 1, 2, 3 పాదాలు.

Tula rashi telugu

ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి, రాశి చక్రములో 7వ ది. ఈ తులా రాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరు ఇప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడం లో అధిక శ్రద్ధ చూపుతారు. తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందర నిలుచుని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతుంటారు.

ఈ తులా రాశికి చెందినవారు ఎత్తుకు పై ఎత్తు వేయటం లో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులా రాశి వారు అధిరోహిస్తరు. ఈ తులా రాశి లో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కుంగిపోక అత్యంత ఉపాయముతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు విజయం సాధిస్తారు.

ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అనగా ఎవ్వరికీ చెప్పరు. వీళ్లు ఇతురుల కుయుక్తులకు లొంగరు. ఈ తులా రాశిలో జన్మించిన వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది.ప్రజా అభిమానానికి సంబంధించిన వృత్తి విద్య ఉద్యోగం వ్యాపారం వ్యాపకాలలో బాగా రాణిస్తారు. ఈ తులా రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులు పొదుపు చేస్తారు. అంతే కాదు తల్లిదండ్రుల ఇచ్చిన స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. 

ఈ రాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. దానధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని అయినా సునిశితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు. ఎవరైనా తగువు లాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళితే వీరు వారికి న్యాయం చేస్తారు.అలాగే ఈ తులా రాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ తులా రాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను మీరు అనుభవిస్తారు. తర తరాలకు ఆదర్శంగా వీళ్ళు నిలుస్తారు.

బంధువర్గంలో విభేదాలు ఈ తులా రాశి వారికి కొనసాగుతాయి ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశి వారిలో ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చినా పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా ఒక్కొక్కసారి వస్తాయి.

ఈ తులా రాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్య లో వీళ్ళు బాగా రాణిస్తారు. వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. ఈ తులా రాశి వారికి సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష ఉంటుంది.అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది ఎంత త్వరగా కోప్పడతారు అంత త్వరగా చల్ల బడతారు.

ఈ తులా రాశి వారిని గమనిస్తే వీరిలో మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాటమీద నిలబడు తత్వం వీరికి ఉండదు.

తులా రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అయితే మీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తి లోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. ఎందుకంటే వీరికి అనుకోని ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తి గా మార్చుకుంటే మంచిది.

ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలని అంటే లక్ష్మి పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం. శనివారం ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది. అన్ని విధాలా కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

ఈ జాతకులకు శుక్ర గ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసివస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించిన శుభ ఫలితాలను ఇస్తుంది.

తులా రాశి వారికి నీలపు రంగు బాగా కలిసి వస్తుంది అందువలన నీలపు రంగు కలిగిన చేతిరుమాలును జోబులో ఉంచుకోవటం ఎల్లవేళలా మంచిది.

ఇక అదృష్ట సంఖ్యల విషయానికొస్తే 6 అనే సంఖ్య వీళ్లకు శుభ ఫలితాలను ఇస్తుంది. 4,5,8 అనే సంఖ్యలు మద్యమ ఫలితాన్నిస్తాయి.

చిత్రా నక్షత్రం లో పుట్టిన వారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు. వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణ యందు ఆసక్తి అధికంగా ఉంటుంది. ఈ చిత్తానక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న ప్రశ్నిస్తారు.అలాగే ఈ చిత్రం నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయస్సు వరకు సుఖభోగాలను అనుభవిస్తారు. ఆతర్వాత ఈ జాతకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి.

అలాగే స్వాతి నక్షత్రంలో జన్మించిన వారికి దయాగుణం దానగుణం అధికంగా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు. చాలా మృదువుగా సున్నితంగా మాట్లాడతారు. వీరు బ్రాహ్మణులకు ప్రియమైన వారుగానూ భోగభాగ్యాలు అనుభవించు వారుగానూ ఉంటారు.

తులా రాశి లో జన్మించిన వారు చిత్తా నక్షత్ర జాతకులు త్రిముఖ రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది.

తులా రాశి లో జన్మించిన వారు ధరించాల్సిన రత్నాలు, చిత్ర నక్షత్ర జాతకులు పగడాన్ని ధరించాలి. ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిక అష్టోత్తర పూజ చేసుకుని, కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన పగడం ధరించాలి.

స్వాతి నక్షత్ర జాతకులు గోమేధికమును ధరించాలి. ఒక మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయించి, మినుములు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన గోమేధికమును మధ్య వేలుకు ధరించాలి.

విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు, ఒక గురువారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి శనగలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కనక పుష్యరాగాన్ని చూపుడు వేలుకు ధరించాలి. ఇలా రక్తదానం చేయడం వల్ల తులా రాశి వారికి కార్యసిద్ధి కలుగుతుంది శుభ ఫలితాలు కలుగుతాయి.

 

 

 

Please share it

1 thought on “Tula rashi telugu / Libra Sign – Nature Hidden Secrets”

  1. Namaskaram guruvu garu
    Na peru ch kameswararao
    Date of birth 29-04-1991
    Morning 8:05
    Place gollaprolu

    Naku jeevitam meda virakthi vachhesindhi
    Love failure ayyindhi
    Studies inka purtikaledu
    March end ki exam results vastunay
    99% ayipotadi ane nammakam vundi
    Oka vela vere parisththi emaina ayithe naku chavu okkate dikku la vundi

    Prati roju badha ga ne vuntadi
    Jeevitam lo eppudu sthira padatano telidu
    Nenu pranam kanna ekkuva love chesina ammayi vadili vellipoyindhi
    Life oka narakam la vundi

    స్పందించు

Leave a Comment