మీ రాశిఫలాలు లను ఖచ్చితంగా తెలుసుకోవాలంటే, ఖచ్చితంగా మీకు మీ రాశి ఏదో మీకు తెలిసి ఉండాలి. అలాంటప్పుడే మీరు ఖచ్చితమైనటువంటి ఫలితాలను తెలుసుకోగలరు. ఈ క్రింద ఇచ్చిన లింక్ మీరు క్లిక్ చేసి, మీరు మీ పుట్టిన సంవత్సరం, నెల, రోజు మరియు ఎక్కడ జన్మించారు ఆ ప్రదేశం, మీ పేరు మీ ఫోన్ నెంబర్ మీ ఈమెయిల్ ఇవ్వండి. మీ యొక్క ఖచ్చితమైన ఎటువంటి రాశి, మీ యొక్క లగ్నం, మీరు ధరించవలసిన రుద్రాక్ష , మరియు రత్నం ఇలాంటి విషయాలు మీకు ఈమెయిల్ ద్వారా పంపుతాను. ఈ లింక్ ని క్లిక్ చేయం

Kanya Rasi / కన్యా రాశి – virgo sign in telugu

Join Telegram Channel
Please share it
5/5 - (1 vote)

Kanya Rasi / కన్యా రాశి స్వభావం  – కన్యా రాశి లక్షణాలు

ఉత్తర పాల్గొని 2, 3 ,4 పాదాలు

హస్త 1, 2 ,3 ,4 పాదాలు

చిత్త 1 ,2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు.

Kanya Rasi

ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభ రాశి అని, ద్విస్వభావ రాశి అని, జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా గాక, ఎక్కువగా పొట్టిగా గాక, మధ్యస్థమైన వంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన టువంటి ముదురు, వెడల్పయిన అటువంటి భుజాలు ఉంటాయి.వీళ్ళు నెమ్మదిగా మాట్లాడె వంటి స్వభావాన్ని కలిగి ఉంటారు.

కన్యా రాశి వారు మృదుమధురంగా మాట్లాడుతారు.ఏ విషయంలో నైనా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన ఇటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. దీనిని అంత సులభముగా వదలదు ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మతః వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు. మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు.

ఈ కన్య రాశి లో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు.చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది. ఆవేశానికి ఉక్రోషాన్ని కి లోనవుతుంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టా ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు.ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు. పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్నిఆలోచించా కే పని ప్రారంభిస్తారు.ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టరు. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు.ఏ పనైనా అప్పగిస్తే  దాన్ని సహనంతో వ్యవహరిస్తారు.

ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకే, ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణము చేయుచున్న చిహ్నము ,ఈ రాశికి సంబంధించిన చిహ్నముగా శాస్త్రములలో కీర్తించబడింది.

ఈ కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింప వలననే కోరిక, అనే స్వభావమును ఉండును. ఈ కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు.

పరిస్థితులు అనుకూలించిన వీరు రాణించి పదిమందికి సహాయపడగలరు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహ పడుట,కార్య రంగము నుండి విరమించుట, చిక్కులు కలుగునని, భయము ఉండును.

పెద్ద పెద్ద కార్యక్రమం నందు వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళటానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించు వారు వీరికి తారసపడినప్పుడు, వీరికి ధైర్యం, బలము వస్తుంది. అయితే ఈ కన్య రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసము వీరికి ఉండదు.

ఈ కన్య రాశి వారికి ఎప్పుడు ఇతురుల గూర్చిన ఆలోచనలు వీరి మనసును బాధపెట్టు చుండును.తమను గురించి ఇతరులు ఏమనుకుంటారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీళ్ళకి ఎక్కువగా ఉండును. 

వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట మిత్రులను గూర్చి చెడ్డగా తలచుట, వారిపైన వారే జాలి పడుట, అను లక్షణాలు వీరికి ఉంటాయి. జనసమ్మర్థం ఉన్నచో బిడియము పెద్ద వారిని స్వయముగా కలుసుకొనుట కు సిగ్గు ఉన్న పరిస్థితిని నిస్సిగ్గుగా చెప్పుటకు ఎక్కువగా సంకోచ పడుతుంటారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలు నెత్తిన ఎత్తుకొని చిరకాలము బాధ పడుదురు.

కన్య రాశి వారు తప్పులు చేసినను దానిని కప్పిపుచ్చేటకు ప్రయత్నించి చిక్కులు పడుదురు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేయుదురు. చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణము దొరుకుతుంది. ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశివారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు. 

Kanya Rasi వారికి  వచ్చిన అవకాశం ఏదైనను దానిని వదలక సద్వినియోగం చేసుకొను గుణము వీరికి కలదు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగములలో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధనశాలలో, బ్యాంకులు, కోశాగారము లు, సహకార శాఖలో వీరు సాధారణముగా రాణిస్తారు.

Kanya Rasi వారికి చిన్నతనంలో వివాహమైన వారికి ఆపేక్ష ఎక్కువగా ఉండును. భార్యా బిడ్డలను వదిలి ఎక్కువ కాలము వేరే ఊరిలో ఉండలేరు. చిన్నతనములోనే ప్రేమ వివాహము చేసుకుని అవకాశము కలదు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయము చేయుటలోనే సరిపోవును.

ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలను తయారు చేయుట లో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దు కొనగల గడసరితనము ఉంటుంది.

Kanya Rasi వారికి గుండెకు సంబంధించిన, మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశము నకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం కలదు. కావున జీర్ణ శక్తికి గూర్చి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మవ్యాధులు కూడా బాధించును. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశివారికి ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు నిరుత్సాహం ఎక్కువగా ఉండును. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపాలి లేదని బాధ అధికముగా ఉండును. మొత్తంమీద కన్య రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి.

ఈ రాశి వారు ధరించాల్సిన రత్నాలు ఉత్తర నక్షత్రం లో జన్మించిన వారు కెంపును ధరించాలి. ఒక ఆదివారం నాడు బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు ధరించాలి.

హస్తా నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి. ఒక సోమవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి, బియ్యం దానం ఇచ్చి, ఉంగరపు వేలుకు వెండి లో పొదిగిన ముత్యాన్ని ధరించాలి.

చిత్తా నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేసుకుని, కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన పగడం ధరించాలి.

కన్యా రాశి వారు ధరించవలసిన రుద్రాక్షలు, ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశ ముఖి రుద్రాక్షను ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.

Please share it

3 thoughts on “Kanya Rasi / కన్యా రాశి – virgo sign in telugu”

 1. Pushpa Chandra Ganesh
  Dob. 28-05-1996
  Time. 2.45.pm
  Kanya rasi
  Hasta 2nd padam
  West godavari District
  Achanta.
  3 years nunchi. anta try chesina nenu anukunna job ravadum ledu guruvu garu. Anno pariharalu chesanu. Ina ravadum ledu.

  Reply

Leave a Comment