Bhavamulona Bahyamunandunu in Telugu

YouTube Subscribe
Please share it
Rate this post

Bhavamulona Bahyamunandunu in Telugu

భవములోన బాహ్యమునందును తిరుమల వేంకటేశ్వరుని స్తుతించే అన్నమాచార్య కీర్తన చాలా ప్రసిద్ధి చెందింది. 

భావములోన బాహ్యమునందును

భావములోన బాహ్యమునందును |
గోవింద గోవిందయని కొలువవో మనసా || పల్లవి

హరి యవతారములే యఖిల దేవతలు
హరి లోనివే బ్రహ్మాండంబులు |
హరి నామములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి యనవో మనసా || చరణం 1

అచ్యుతుడితడే ఆదియు నంత్యము
అచ్యుతుడే యసురాంతకుడు |
అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీదనిదె
అచ్యుత యచ్యుత శరణనవో మనసా || చరణం 2

విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు |
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా || చరణం 3

Please share it

Leave a Comment