karthika puranam telugu
ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కార్తీక పురాణం వినబోతున్నాం. కర్ణ కార్తీక సమోహ మాసః అంటారు. కార్తీక మాసానికి సమానమైన మాసము ఇంకొకటి లేదు.
అయితే మనం భగవద్గీతలో వింటానం వింటుంటాం మనం మాసాన మార్గశీర్షోహం అని చెప్పాడు కృష్ణుడు. భగవంతుడే తాను స్వయంగా మార్గశీర్ష మాసాన్ని అని చెప్పినప్పటికీ కూడా మార్గశీర్షానికి ముందున్నటువంటి కార్తీక మాసాన్ని మించిన మాసం ఇంకొకటి లేదని, శాస్త్రోక్తి ఆర్యోక్తి పురాణోక్తి కూడా మామూలుగా మనకి ప్రతి పండుగ ఓ పండగ ఒక రోజు ఉంటుంది ఒక పండగ హాఫ్ డే చేసుకునే పండగలు కూడా కొన్ని ఉన్నాయి పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఒకరోజు పండగలు మూడు రోజుల పండగలు 10 రోజుల పండగ కూడా చేసుకున్నాం మనం. అయితే ప్రతిరోజు పండుగగా ఉండేటువంటి కార్తీక మాసము అత్యంత విశేషమైనది అత్యంత ఫలప్రదమైన మాసం. ప్రత్యేకంగా ఈరోజు అని లేదు, ఏ రోజు కుదిరినా సరే కార్తీకంలో చెప్పబడిన ఏ ఒక క్రియనైనా సరే స్నానము, జపము, తపము, దానము, దీపారాధనము దేవాలయ సందర్శనము ఏది చేసినా సరే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది తిధులతోటి సంబంధం లేకుండా. అయితే ఈ నెలఅంతా కూడా కార్తీకానికి ప్రత్యేకంగా చెప్పబడింది కార్తీక స్నానాలు.
దీనికి ముందున్న మాసంలో మనం ఆశ్వేజ మాసంలో అమ్మవారి కోసం కూడా విశేషమైన అర్చనలు చేశం. ప్రత్యేకించి ఆశ్వేజ కార్తీక మాసాలు శరదృతువులోవి శరదృతువు తాలకు మలిభాగంలో మనకి కార్తీకం వస్తుంది. ఈ శరదృతువు బలిసేసరికి అంటే ఒక నెల రోజులు గడిచి రెండో నెలలో ప్రవేశించేసరికల్లా సూర్యుడి వెచ్చదనం తగ్గిపోవటం మొదలు పెడుతుంది.
పగళ్ళు చిన్నవి రాత్రులు పెద్దవి అవుతాయి. సూర్యగమనం ఆలస్యం అవుతుంది సూర్యాస్తమయం తొందరగా అయిపోతుంది. ఇక్కడి నుంచే గమనించండి చలి పెరుగుతుంది. ఎండవేళలు తగ్గిపోతే గ్రీష్మ తాపం కూడా తక్కువగా ఉంటుంది. శరదృతువులో వెన్నెల ప్రత్యేకమైనది చంద్రుడు ఎక్కువ చల్లగా ఉంటాడు. శీతాకాలపు గాలి కూడా కలుపుకొని కానీ సూర్యుడు తగ్గిపోతాడు.
ఈ సూర్యుడు తక్కువగా ఉండే కాలంలో జీవుల కంటే మనలాంటి మానవులకి శరీరానికి వెచ్చదనం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ లోపల ఉండవలసినటువంటి దానికి సరిపడా వేడి లేకపోయేసరికల్లా రకరకాల అనారోగ్యాలు చుట్టుముట్టేస్తాయి. ఆ వేడిని పెంచుకోవడం కోసం ఈ కాలంలో ప్రత్యేకంగా శాస్త్రవచనంగా స్నానం చేయమని చెప్పారు. అయితే ఈ స్నానం ఎప్పుడు చేయాలి తెలవారు జామున సూర్యోదయానికి ముందు అది కూడా వాపీ కూప తటాకాదుల యందు స్నానము విశేషంగా చెప్పబడింది.
అంటే నూతులు బావులు తర్వాత చెరువులు ఎక్కడైనా జలధారలు ప్రవహిస్తున్నటువంటివి జీవనదులలోనూ స్నానం చేస్తే గనుక విశేషమైన ఫలితం లభిస్తుంది. అని దీనికి ముందు ఒక్క రోజునే ముందు జరిగినటువంటి దీపావళి పండగకి ఒక ప్రత్యేకమైన వాక్యం చెప్తారు తైలే లక్ష్మి జలే గంగ అని తైలంలో లక్ష్మి జలంలో గంగ ఉంటాయి అని అందుకని బాగా దీపాలు వెలిగించుకుంటాం.
ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి అది పూర్తిగా నిలబడి ఉంటుందన్నమాట మొత్తం ప్రపంచంంతా వ్యాపించి ఉండేటువంటి జలాలలో గంగా నది ప్రవహిస్తుందట తీలలతోటి చేయబడినటువంటి తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది. వీటితో పాటుగా నీటి యందు అగ్ని ఉంటుందని ప్రత్యేకంగా చెప్తారు అగ్ని ఆరాధన మనం ఎలాగో చేస్తాం దీపాలు వెలిగించి ఈ ముగ్గురిని ఆరాధించేటువంటి ఈ మాసం చాలా విశేషంగా చెప్తారు.
శివుడు కళ్యాణకారకుడు మృత్యుభయ నివారణ చేసేవాడు నిరాడంబరుడు అసుతోషుడు అభయంకరుడు ఆయన అనుగ్రహించే మాసం ఇది అలాగే తన పాలనా దక్షణతోటి, జీవులని రక్షించేవాడు వ్యాపనశీలుడు జగన్యామకుడు అయినటువంటి మహావిష్ణువు ఈ మాసంలో దామోదరుడుగా పిలవబడతాడు. మనం శివుడి కోసమే రకరకాల రుద్రాభిషేకాలు చేస్తాం. ఏకాదశి రుద్రం, చేస్తాం ఏక రుద్రం చేస్తాం, శివాభిషేకం విశేషంగా చేయబడుతుంది.
శివాలయాలు అన్ని చోట్ల అర్చనలు చేయబడతాయి కానీ కార్తీక దామోదర ప్రీత్యర్థం అన్న ఆ వాక్యంతోటే పూజా ప్రారంభం జరుగుతుంది. అనుగ్రహించే పరమేశ్వరుడు మనకి ప్రత్యక్షమవుతున్న సమయంలో జగన్యామకుడైనటువంటి విష్ణువుని తలచే శివుని పూజించాలని ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్తారు. శివకేశవులుఇద్దరూ ఒకేసారిగా పూజింపబడేటువంటి ఈ ప్రత్యేక మాసంలో ఏ చిన్న పూజ, తపము, జపము, ఉపవాసము, స్నానము, విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ప్రత్యేకంగా కార్తీకానికి ఒకటి స్నానం చెప్పుకున్నాం రెండోది ఉపవాస క్రియలు కూడా చాలా అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి.
కార్తీక పురాణం ఒకటవ అధ్యాయం
వశిష్ట మహాముని జనక మహారాజుకి కార్తీక మాస విశిష్టతను వివరించడం. మహాజ్ఞాన సంపన్నులు తపోనిష్టులైన ఋషులకు మునులకు నిలయము, పుణ్యప్రదమైన నైమిశారణ్యం. భారతదేశం నందున ఈ నైమిసారణ్యం, రకరకాలైన పళ్ళు కాయలు పువ్వులతో నిండినటువంటి వృక్షాలు, చెట్లు లతలతోటి అలరారుతూ ఉంటుంది. ఈ అరణ్యంలో నివసించే చిలుకలు, గోరువంకలు, చక్రవాకాలు, హంసలు, మయూరాలు వాటి విన్యాసాలతో మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. దానికి తోడు సహజ వైరం కలిగినటువంటి పశుపక్షాది మృగాలు కూడా సహజ వైరాన్ని వదిలిపెట్టి పరస్పరం, స్నేహాదరాలతోటి కలిసి మెలిసి తిరుగాడుతూ కనిపిస్తాయి.
అవ్వడానికి అరణ్యమే అయిన యజ్ఞయాగాది క్రతువులతోను పురాణ ఇతిహాసాది ప్రవచనాలతోను వేద వేదాంగాది చర్చలతోను, నిండి పరమ పవిత్రమై భూలోకంలోని, స్వర్గంఏమో అనిపిస్తుంది. నైమిసారణ్యం ఇప్పటికీ స్వర్గం లాగానే అనిపిస్తుంది. చాలా సహజంగా, ప్రకృతికి దగ్గరగా జీవించాల అనుకునే వాళ్ళు నైమిసారణ్యాన్ని తప్పకుండా ఒకసారి జీవితంలో చూడాలని చెప్తారు. అంతటి మహోన్నతమైన ఋషివాటికలో సుప్రసిద్ధుడైనవాడు సూతమహాముని. సూత మహర్షి వేద వేదాంగ విజ్ఞాన ఘనుడు, పురాణేతిహాస ప్రవచనకర్త, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి మహాజ్ఞాని తనకు కలిగినటువంటి మంజుల మధుర వజో సామర్థ్యంతోటి వేద ధర్మాలను వేద జ్ఞానాన్ని సవిస్తరంగా వివరించి చెప్పగలిగిన మహా మేధావి, సాక్షాత్తు భగత్ స్వరూపుడైనటువంటి మహాముని వలనే ఈ నైమిశారణ్యం పరమ పవిత్రమై సకల విజ్ఞాన క్షేత్రమై మాన మానవ ధర్మ ప్రబోధకమై ప్రకాశిస్తుంది. మనం ప్రతి వ్రత కథలోనూ చాలా వ్యవహారాల్లో అంటే చిన్న పొన్న అన్ని వ్రతాల్లోనూ కూడా సూతమహాముని ప్రస్తావన లేకుండా ఏ వ్రత కథ కనిపించదు మనకి సూతుడు ఆ ప్రవచనకర్తే కాదు ఏ విషయాన్ని అడిగినా సరే సాకల్యంగా ఇది ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళతో చెప్తున్నప్పుడు నేను విన్నాను వాళ్ళు ఎవరో నాకు చెప్పారు అది మీకు చెప్తాను అంటాడు అంటే ఈయన మహాముని అయన మనకు ఎట్లాంటి ప్రబోధన చేస్తున్నారు అంటే ఎవరైనా ఏదైనా చెప్తే శ్రద్ధగా వినయంతోటి వినాలి, ఆ విన్న విషయాన్ని ఇంకొకళ్ళకి తెలియజేయాలి.
ఆ రకంగానే విజ్ఞానం ప్రపంచం అంతటా వెళ్తుందని మనకి సూతమహాముని తన యొక్క ప్రజ్ఞతోటి తెలియజేస్తాడు.
ఒకానొకనాడు నైమిసారణ్యంలోని ఋషులంతా సూత మహర్షి దగ్గరికి వచ్చారు. ఆయన వారందరినీ గౌరవించి కూర్చోబెట్టి, అందరూ ఒకేసారి వచ్చారు ఏమిటని విషయం ప్రశ్నిస్తే ? వారిలో ఒకరు ఋషులందరిలోకి నాయకుడైనటువంటి శౌనకుడు నమస్కరించి, మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులమై కర్మధర్మ ఆచరణ ప్రవర్తకులమై, యజ్ఞ యాగాది జపతపోనిష్టులమై వృద్ధి పొందుతున్నాము.
మీ చేత కార్తీక మాస మహాత్మమును చెప్పించుకొని వినాలని భావిస్తున్నాం. అంటే కార్తీకం సమీపంలోకి వచ్చింది. ఈ మాస విశిష్టతను తెలుసుకుంటే ఇక్కడున్న ఋషులందరూ కూడా తలా ఒక చోటికి వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట దాన్ని ప్రచారం చేయడం కోసం, కేవలం లోక కళ్యాణం కోసం మాత్రమే, వాళ్ళు కనుక్కొని సొంతంగా తెలుసుకోవటం ఎలా విన్నారో అలా ఇంకొకళ్ళకి తెలియజేస్తారు.
కార్తీక మాసము హరిహరులుఇద్దరికీ పరమ ప్రీతికరమైనది. ఈ మాసంలోని 30 రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలే, ఈ మాసంలో చేసిన స్నాన, జప, తప, దానాలకు, అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము. అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవాన్న అంతటిని సమస్త విశేషాలతోటి సవివరంగా వినిపించి మమ్మల్ని కృతార్థులని చేయవలసిందని, ఋషులందరూ సూత మహామునిని ప్రార్థించారు. సూతుడు ఇల్లా చెప్పారట.
మునిజన శ్రేష్టులారా మీ కోరిక పరమ ఆమోదకరము. మీరు అన్నట్టే కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదమైనది. ఈ మాసం కేవలం హరిహరులకు మాత్రమే కాదు సమస్త దేవతలకి కూడా ప్రీతిపాత్రమైనది. ప్రతి మాసంలో ఏదో ఒక రోజు పర్వదినం ఉంటుంది. కానీ కార్తీకంలో నెల రోజులు పర్వదినాలే. ఈ మాసం ధర్మ కార్యాచరణలకు నియమ నిష్టలకు నిలయం.
ఈ కార్తీక మహాత్మం విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి. ఈ మాసంలో కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు తులా రాశిలో సంచరిస్తాడు. కనుకనే ఈ మాసంలో చేసిన పూజలు వ్రతాలు దానధర్మాలకు దీపారాధనలు వాటికే కాకుండా దీపారాధనలు నక్తములు, ఉపవాసములు, పురాణ శ్రవణములు అనేక జన్మలలో చేసిన పాపాలని పరిహరింపచేసి పుణ్యగతులను ప్రసాదిస్తాయి. ఇప్పుడు నక్తము ఉపవాసము రెండు వేరు వేరు పదాలు వచ్చినాయి.
ఉపవాసం అంటే మనకు తెలుసు ఒక పొద్దు ఉంటాం పగలు, ఉపవాసం ఉండి, రాత్రి భోజనము లేదా పగలే భోజనం చేసేసి రాత్రి ఉపవాసం ఉంటాం మనం శనివారాలు గురువారాలు చేసినట్టుగా కార్తీక నక్తాలు చాలా విశేషమైనవండి పగలు ఉపవాసం ఉండటం మొత్తం అసలు ఇంకా ఏమీ లేదు ఏదైనా ఫలహారం తీసుకోవడం లాంటివి కూడా లేదు అసలు నిర్జలోపవాసం కూడా చేస్తారు, చాలా చోట్ల మంచి నీరు కూడా తీసుకోరు.
పొద్దున స్నానం చేయటము తర్వాత జపతపాదలు నిర్వహించుకోవడం సంధ్యావందనం చేసేవాళ్ళు అది లేదా పూజా విధానం చేసుకునే వాళ్ళు ఎక్కువగా మాట్లాడకూడదు, పోట్లాడకూడదు అబద్ధాలు చెప్పకూడదు నక్తాలు ఉండేవాళ్ళ ప్రత్యేకత ఇదే అన్నమాట. సాయంకాలం ఇలా సూర్యాస్తమయం అవ్వగానే చుక్కలు చూడంగానే భోజనం చేస్తారు. మళ్ళీ దీపం పెట్టుకోవడం పూజ చేసుకోవడం యధావిధిగా చేయటం చీకటి పడంగానే భోజనం చేయటాన్ని ఈ నక్తాలు అంటారు మొత్తం కార్తీక మాసం అంతా కూడా ఇంకా తిధి నియమాలు అవి ఏమీ లేవు వాళ్ళకి అంతకు ముందు ఏమనా ఉపవాస నియమాలు ఉన్నా, ఈ కార్తీకంలో ఇంకా ఆ నియమం పెట్టుకోరున్నమాట కార్తీక నక్తాలు అనేది ఒక ప్రత్యేకమైన విధి. ఇలా నక్తాలు చేయబడే మాసం ఇంకొకటి లేదు కుదిరితే చేయగలిగిన వాళ్ళు ఓపికమంతులు బీపీలు షుగర్లు అలాంటివి ఏవి లేని వాళ్ళు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు పసిపిల్లల తల్లులు గర్భవతులు కానివారు చేయొచ్చు మనకి ఓపిక ఉంటే గనుక అయితే అపీష సిద్ధి సిద్ధించి లభించి జీవితం సుఖమయంగా సాగుతుంది. ఇహపరాలలో ఉత్తములుగా వర్ధిల్లుతారు. మానవ శ్రేయోపలాషలై తరించే మీకు ఈ పురాణాన్ని వినిపించడం వల్ల నేను ఉత్తమగతిని పొందుతాను అని చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నారుఅన్నమాట. ఈ కార్తీక పురాణాన్ని గురించి స్కాంధ పురాణంలో చెప్పబడింది. దీన్ని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీ దేవికి శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మీదేవికి చతుర్ముఖుడు నారద మహర్షికి అంటే బ్రహ్మదేవుడు నారద మహర్షికి నారదుడు వశిష్ట మహర్షికి వశిష్టుడు జనక మహారాజుకి వివరంగా చెప్పారు.
వశిష్టుని దయవలననే ఈ కార్తీక మాస మహాత్మ్యాన్ని వినే అదృష్టం నాకు కూడా కలిగింది. నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు కూడా వినిపిస్తాను సావధాన మనసుకులుగా విని ధరించండి అన్నారు. ఒకనాటి పవిత్ర దినాన వశిష్ట మహర్షి మిధిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. రాజర్షి అయిన జనకుడు వశిష్ట మహర్షికి సగౌరవంగా సముచిత మర్యాదలు చేసి ఏం కావాలి ఏ కారణంతోటి మీరు ఇక్కడికి వచ్చేసారు స్వామి అని కనుక్కున్నాడు అన్నమాట.
కనుకుంటే వశిష్ట మహాముని ఏం చెప్పారంటే సిద్ధాశ్రమంలో యాగం చేయాలని సంకల్పించాను యాగానికి నీ సహాయం అడుగుదామని వచ్చాను అన్నాడు. దానికి జనకరా మహర్షి జనకరాజర్షి ఏమన్నారంటే మీ యాగానికి కావలసిన ధనాన్ని అనేక విధాలైన సంబారాలని అన్నిటిని మీ కోరికను అనుసరించి నేను మీకు సమర్పిస్తాను. నాకు నా సంపదలకి అంతకుమించి ప్రయోజనం ఏమీ లేదు.
ఇక్కడ ఇంకొక వాక్యం మనం తెలుసుకోవాలి. పూర్వకాలంలో కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగాల్లోనూ ఋషులు మునులు ఇలాగ ఏదైనా ఆ యజ్ఞయాగాదులు తలపెట్టినప్పుడు ఏ ప్రాంతంలో ఇవి చేస్తున్నారో ఆ ప్రాంతపు రాజు దగ్గరికి వెళ్లి ఈ విషయం తెలియజేసేవారు. యజ్ఞయాగాదులకు కావలసినటువంటి అన్ని అన్ని రకాల సంబారాలు మనుషుల్ని కూడా రాజే సప్లై చేసేవాడు.
రాజుల విధి ఇలా యజ్ఞయాగదులో తమ రాజ్యంలో జరపబడితే దానివల్ల తమ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని దాని యొక్క ఫలితం చేసిన వాళ్ళకి ఎంత లభిస్తుందో ఆ ప్రాంతానికి అంతే లభిస్తుంది కాబట్టి అది పూర్తిగా రాజుల బాధ్యతగానే ఉండేది ఇది ఇంకొక రెండు మూడు పురాణాల్లో కథల్లో మనకి కనబడుతుంది రాజు సహాయం చేశాడు అని జనకరాజర్షి సవినయంగా ఒప్పుకున్నాడు ఒప్పుకుని ఇలా ఏమ అడిగారంటే నాకు చాలా కాలం నుంచి ధర్మార్థ కామమోక్ష ప్రదాయకమైన సర్వపాపహరమైన కార్తీక మాస మహాత్మ వినాలని కోరిక కనుక నా యందు అనుగ్రహం ఉంచి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుని చేయమని ప్రార్థించాడట. విశ్వశేయసును కోరుకునే వాళ్ళకి భక్తి కలిగిన వారికి ఈ విధమైన కోరికలు కలగటం సహజమే. కార్తీక మాసం 30 రోజులు పుణ్యప్రదమైనవి. ఈ మాసంలో చేసే జపదప స్నాన దానాదులకి వ్రతాలకు అనంతమైన ఫలితం కలుగుతుంది. అని ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి ఈ మాస మహాత్మ్యాన్ని గురించి స్కాంద పద్మ పురాణాలు రెండు కూడా వివరించి విశేషంగా చెప్పాయి. ఈ కార్తీక మాసంలో సూర్యోదయ
కాలానికి ముందుగా చేసే స్నానము, పరమ పుణ్యప్రదం. ఈ మాసంలో గంగా నది సమస్త నదీ జలాలలోనూ కాలువలు చెరువులు మొదలైనటువంటి సహజ జలాశయాల అన్నిట్లలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. స్నానంతో పవిత్రులైన పుణ్యప్రదమైన శరీరంతోటి చేసేటువంటి దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసంలో చేసే పితృ కార్యాలు పితృ కర్మలు ఏడేడు తరాల వరకు పుణ్యగతులను కలిగిస్తాయి.
ఈ కార్తీక స్నాన వ్రతాదులని ఆచరించడానికి స్త్రీలు పురుషులు బాలురులు యువకులు వార్ధక్యంలో ఉండటము అలాంటి తేడాలు ఏవి ఉండవు ఏ వయసు వారైనా ఏ జాతి వారైనా స్నాన దాన జప తపాదులను చేసి తరించే ప్రయత్నం చేయొచ్చు. జనకర మహారాజా చెప్తున్నారన్నమాట ఇట్లా వివరంగా ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ కేదారేశ్వర వ్రతములను ఈ మాసంలో ఆచరించడం వల్ల శివకేశవులు ఇద్దరి అనుగ్రహము లభిస్తుంది.
సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానము ముక్తిప్రదమైనది. మనం కార్తీకంలో చేయవలసిన దానధర్మాలు సంధ్యావందనాది నిత్యకర్మలు తర్పణాలు దీపారాధనలు దీప దానాలు వనభోజనలు సమారాధనలు సోమవార వ్రతాలు కార్తీక పౌర్ణమి నోములు ఇవన్నీ కేవలం పుణ్యాన్ని ప్రసాదించడానికి మాత్రమే కాక శరీరానికి తేజస్సును శక్తిని మేధస్సును మనసుకి శాంతిని స్థిరత్వాన్ని స్థిమితాన్ని సంపదలని కూడా కలిగిస్తాయి.
భుక్తి ముక్తులని ప్రసాదించేటువంటి ఏకైక మాసం కార్తీక మాసమే ఈ కార్తీకంలో ఏకభుక్తం ఇంతకుముందు మనం చెప్పుకున్నది ఉదయం భోజనం చేసి ఉండటం పగలు మధ్యాహ్నం లంచ్ చేసేసి ఉండటం అన్నమాట తర్వాత నక్తం ఉదయంఅంతా ఉపవాసం అండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయటం సోమవారాలు పౌర్ణమి ఏకాదశులు మొదలైన రోజుల్లో చేసేటువంటి ఉపవాసాలు మోక్షప్రదాలు పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థ ప్రసాదాలు స్వీకరించడం ఆ ఉపవాసం చేయడం అనేవి పుణ్యం ముక్తి ప్రదాలు అంటే కేవలము భగవంతుడికి నివేదన చేసిన పదార్థాన్ని మాత్రమే నైవేద్యం ఏదైతే పెట్టామో అది ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడం నివేదన చేయని ఏ పదార్థాన్ని ఎవ్వరింట్లోనూ తీసుకోకపోవడం కూడా ఒక ఉపవాస లక్షణం అది కూడా చేయొచ్చు అన్నమాట వారంతటి వారిగా ఇతరులు పెట్టిన దానినే భుజిత అంటే సొంతంగా వంట చేసుకోకుండా ఎవరైనా పెట్టింది మాత్రమే భుజిస్తూ ఉండటం కూడా ఒక రకమైన ఉపవాసం తర్వాత నిత్యము జపము తపము పురాణ పఠనము లేదా పురాణ శ్రవణము దీపారాధన చేయటము
క్షేత్ర సందర్శనము, మొదలైన వాటన్నిటిని కూడా భక్తి శ్రద్ధలతో చేయటం ఆయురారోగ్యదాయకమే కాక మోక్షకారకం కూడా ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. అంటే ఈ ఉపవాసాలు ఇన్ని విధాలుగా చెప్తున్నారు పగలు ఉపవాస పగలు భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉండొచ్చు పగలల్లా ఉపవాసం ఉండి చుక్కలు చూసాక భోజనం చేయొచ్చు మనం వండ చేసుకోకుండా ఎవరైనా పెట్టింది రోజు భిక్ష భిక్షా స్వీకారం ఇది కూడా చేయొచ్చు లేదా కేవలం స్వామికి భగవంతుడికి ఏది నివేదన చేస్తామో దాన్ని మాత్రమే చేయొచ్చు అలా కాకుండా ప్రతిరోజు యాత్ర ఏదో ఒక దేవాలయ దర్శనానికి వెళ్తూ దాన్ని కూడా ఉపవాసంగానే భావిస్తారు అంటేఆ ఆహార నియమం ఉండటమే కాదు ఉపవాసం అంటే భగవంతుని సమీపంలో ఉండటం తీర్థ క్షేత్రాలని దర్శించడం కూడా ఒక ఉపవాస నియమం కిందకే వస్తుంది. ఈ రకంగా ఏది కుదిరితే అది ఎవరికి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం ప్రకారం అత్యంత పుణ్యాన్ని కలుగజేసేటువంటి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ నెల రోజుల్లో ఏదో ఒక రోజు అన్ని
రోజులు చేయగలిగితే మహత్తరంగా ఉంటుంది. ఒక్క రోజు లేదా కేవలం కొన్ని పర్వదినాలు నాలుగు సోమవారాలు రెండు ఏకాదశులు తర్వాత పౌర్ణమి మధ్యలో నాగుల చవితి లాంటి భగిస్త భోజనం ఇలాంటివి పర్వదినాలు కూడా వస్తాయి కదా ఈ దినాలలో అయినా కూడా కనీసం మనం పొద్దున్నే తెలవార్చామనే స్నానం చేయటం దీపారాధన చేసుకోవటము దేవాలయంలో దీపం వెలిగించటము ఇవి కాకుండా దేవాలయంలో వెలిగించేటువంటి ఆకాశ దీప దర్శనం చేయటం జ్వాలాతోరణం వెలిగిస్తారు జ్వాలాతోరణ దర్శనం చేయటం ఏదో ఒక పుణ కార్యాన్ని గనక చేయగలిగితే ఇంకా దీపం పెట్టుకోవడం దీప దానం చేయటము పళ్ళు కూరలు దానం చేయటము ఆహారాన్ని దానం చేయటము ఎవరికైనా భోజనాన్ని పెట్టించడమ అట్లాంటిది ఏది చేసినా కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది చాలా మనసుకి సంతోషంగా కూడా ఉంటుంది స్నానము విశేషమైన నియమం అది చేయగలిగితే అదృష్టం అనారోగ్యంతో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు గర్భవతులు చంటి పిల్లలు తల్లులు ఒక స్నానం చేయగానే వెంటనే జలుబు చేసే లక్షణం ఉన్నవాళ్ళు వీరు చేయలేకపోతారు కదా కేవలం పర్వత దినాల్లో అయినా కూడా ఈ విధిని పాటించి అత్యంత పుణ్యఫలప్రదమైనటువంటి కార్తీక మాసాన్ని మనం మన యొక్క గ్రహ బాధల నుంచి, తప్పించుకోవడానికి గాని పూర్వజన్మ కృతమైనటువంటి, రకరకాల కర్మానుభవాల నుంచి తప్పించుకోవడానికి గాని ఈ మాసాన్ని మనకి అనుగుణంగా ఉపయోగించుకోవాలి. దీనితోటి మొదటి రోజు పారాయణ ముగిసింది.
ఇవి కూడా చదవండి : కార్తీక పురాణం రెండవ రోజు కథ





