karthika puranam telugu day 2
కార్తీక పురాణం రెండవ రోజు కథ
నమస్కారం కార్తీక మాసం రెండో రోజులోకి వచ్చాం. యమద్వితీయ అంటారు, ఈరోజున భగిని హస్త భోజనం, అని అక్కచెల్లెళ్ల చేతి అన్నం తినాలి అన్నదమ్ములు అనే నియమం ఉంది. క్యాలెండర్ లో తప్పకుండా రాస్తారు. భగిని హస్త భోజనము అని, మన అక్కచెల్లెళ్ల ఇళ్లకి అన్నదమ్ములు వెళ్లి వారిని ఆశీర్వదించి పెద్దవారైతే వారి దగ్గర ఆశీర్వాదం పొంది, భోజనం చేసి ఏదైనా ఒక కానుకని వాళ్ళకి ఇచ్చి తిరిగి రావడం మన ప్రాంతపు ఆచారంగా ఉన్నది. ఎవరెవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఈ పని చేయవచ్చు. ఒకవేళ ఏదనా దూర ప్రాంతాల్లో ఉంటే అక్కనో చెల్లెల్నో ఒక మాట పలకరించి మాట్లాడినా కూడా ఇదిఒక తప్పనిసరి, విధానంగా మనం రాఖీ కట్టడాలు లాంటివి చేస్తూనే ఉన్నాం కదా నిజానికి మన ప్రాంత ఆచారం కాదు రాఖి అలవాటు చేసేసుకున్నాం ఇక్కడంతా వచ్చేసింది. సౌత్ ఇండియా అంతా కూడా దక్షిణ భారతదేశం అంతా చేస్తున్నారు ఇప్పుడు ఇది ఈ దక్షిణ ప్రాంతంలో ఆచారంగా ఉండే పద్ధతి అన్నమాట మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. అయితే ఈ రెండో రోజు ఏం చెప్పారు మనం వశిష్ట మహాముని ఏం చెప్పారో చూద్దాం.
ఆయన చెప్తున్నారు రాజా కార్తీక మహాత్మ్యాన్ని విను వినినంతనే మనోవాకాయముల వల్ల చేయబడిన పాపమంతా నశిస్తుంది అంటే మనం మాటలతోటి కానీ, క్రియతోటి ఏదైనా పనుల వల్ల గాని లేదా మన మనసులోనే ఏదైనా పాప బుద్ధి, చెడు తలంపులు చెడు ఆలోచన, ఏదైనా చేసేద్దాం అనిపించే ధోరణి అలాంటిది ఉన్నా కూడా వాటి వల్ల చేసిన పాపాలన్నీ కూడా కార్తీక మాస మహాత్మ్యాన్ని వింటే పోతాయట. కార్తీక మాసమందు శివ ప్రీతిగా సోమవార వ్రతమా ఆచరించేవాళ్ళు కైలాసవాసిగా అవుతాడు. ఇదే ఈ కార్తీకంలో సోమవారమున స్నానం, కానీ దానం కానీ జపం గాన చేసిన యెడల ఆ వేయి, అశ్వమేధ యాగాల ఫలితాన్ని పొందుతారు. ఇందులో ఎలాంటి సందేహము లేదు కార్తీక మాసమందు ఒకటి ఉపవాసము, రెండు ఏకభుక్తము మూడు రాత్రి భోజనము, నాలుగు అయాచిత భోజనము ఐదు స్నానము ఆరు తిలదానము, ఈ ఆరు ఉపవాస సమానాలుగా అవుతాయని చెప్పబడింది. శక్తి గలవాడు పూర్తి ఉపవాసం చేయవలెను. అందుకు శక్తి లేని వాళ్ళు రాత్రి భోజన నియమాన్ని చేయాలి. అందుకు శక్తి లేని వాళ్ళు ఛాయా నక్తం అంటే ఏమిటి ఛాయాక్తము సూర్యకాంతి కొంచెం తగ్గాక అంటే మధ్యాహ్నం అయిన తర్వాత, తన కొలతతో రెట్టింపు కొలతకి నీడగా మనం నిలబడితే మన నీడ డబల్ పడాలన్నమాట అలా గనక పడితే అంటే మూడు మూడు ఆమూడున్నరకి అట్లా అవుతుంది, ఆ సమయంలో భోజనం చేయటం. లేదా అలా కూడా అప్పటిదాకా ఖాళి పొట్టతోటి ఉండలేని
వాళ్లైతే బ్రాహ్మణులను ఎవరినైనా భోజనానికి పిలిచి వారితో సహా పగలే భోజనం చేయాలి ఇది గృహస్థలకు అశక్తి యందును శక్తి యందును అన్ని విధాల ప్రతివారికి విధించబడింది. ఎవరైనా ఇది ఇలా చేసుకోవచ్చు అన్నమాట, ఎవరితోటైనా కలిసి భోజనం చేయటం అంటే వేరే వారికి ఇతరులకి భోజనం ఇచ్చి వారితో కలిసి భోజనం చేయటం కూడా, ఆ ఉపవాసంతో సమానమైన ఫలితాన్నే ఇస్తుందని చెప్పారు. మానవులు కార్తీక మాసమందు కార్తీక వ్రతాల్లో దేన్నైనా ఆచరించని యెడల అంటే ఇన్ని చెప్పారు కదా ఇన్ని రకాలు వీటిలలో ఏ ఒకటి కూడా చేయకపోతే గనుక ఎనిమిది యుగాలు నరకమందు కుంభీపాకంలోనూ, రౌరవంలోనూ నానా బాధలు పడతారట.
కార్తీక సోమవారమందు ఒకవేళ భర్తలు గనుక లేనివారు, ఈ జన్మలో ఏదో ఒక ఇబ్బంది వల్ల భర్తని కోల్పోయిన వారు గనుక ఈ కార్తీక మాసంలో సోమవారాలనాడు యధావిధిగా గ ఉపవాసం చేసి,పరమేశ్వరుని పూజిస్తే గనుక శివలోకాన్ని పొందుతారు. అందరూ చేయొచ్చు అని చెప్పడం కోసమే ఈ వాక్యం చెప్పబడిందండి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరు కార్తీక సోమవారం, నక్షత్రాలు చూసి రాత్రి భోజనం చేస్తారో వాళ్ళ వాళ్ళ యొక్క పాతకాలు అగ్ని యందు వేయబడిన దూది వలే నశించిపోతాయి. అగ్నిలో దూదితందని క్షణాల్లో మాయమైపోతుంది. అలాగా పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయాలన్నమాట. అలా చేస్తే పాపం నశిస్తుంది. కార్తీక సోమవారణమందు శివలింగమునకు అభిషేకము పూజ చేసి రాత్రిపూట భుజించేవాడు శివుడికి పరమ ప్రీతికారకుడు అవుతాడట. ఈ విషయాన్ని గురించి తెలిపేటువంటి ఒక కథ ఉంది చెప్తున్నారు ఏమట ఇది వినేవారికి చెప్పేవారికి కూడా పాపనాశనం అవుతుందట. పూర్వము కాశ్మీర దేశంలో ఒకానొక పురోహుతుని కూతురు స్వాతంత్ర ఆ నిష్టురి, ఆమె పేరు అనే పేరు కలిగినటువంటి ఒక చక్కటి అందమైన అమ్మాయి ఉండేదట ఆమె చక్కని రూప తోటి మత అతి యవ్వనం తోటి కూడి అందంగా అలంకారం చేసుకొని, అందరితోటి మాట్లాడుతూ జారత్వాన్ని అవలంబించి ఉండేది. ఆమెకి దుష్ప్రవర్తనం ఉంది. ధర్మయుతంగా ప్రవర్తించేది కాదు ఆమె దుర్గుణాలు చూసి ఆమె తల్లిదండ్రులు అత్తమామలు కూడా ఆమెను వదిలిపెట్టేసారట. అయితే ఇతను ఆమె భర్త పేరు ఏమిటి సౌరాష్ట్ర దేశీయుడైన మిత్ర శర్మ, అతని భర్త అట. ఆయన వేద వేదాంగ పారంగతుడు ఎన్నో చదువుకున్నాడు. ఏం చదివాడు ఋగ్వేద యజుర్వేద సామ అధర్వణ వేదాలు చదువుకున్నాడు. తర్వాత ఏమో శిక్ష వ్యాకరణము,ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము కల్పము, అని చెప్పబడేటువంటి వేదాంగాలని కూడా చదువుకున్నాడు. వీటిని సంపూర్ణంగా చదివిన వాడిని వేద పారంగతుడు అంటారు వేద వేదాంగ పారంగతుడుగా ఉన్నాడు సదాచారవంతుడు
సమస్త భూతములందు దయ కలిగినవాడు అయితే అసలు ఏనాడు అబద్ధాలు చెప్పేవాడు. కాదు ఎన్ని తీర్థాలో సేవించాడు నిరంతరము సుచిగా ఉండేవాడు.ఎంత ఎంత ఉత్తమ గుణాలు కలిగినవాడో కానీ అతని భార్యగా ఉన్నటువంటి ఈ నిష్టుర మాత్రము ఏం చేసేదట పరమ స్వాతంత్రయాన్ని అవలంబించేది భర్తని ఏదైనా మాట తేడా వస్తే కొట్టేసేదట బెదిరించేది కొట్టేది ఇలా నిత్యము ఆమెతోటి దెబ్బలు తింటూ గృహస్థ ధర్మములందు కోరిక చేత భార్యను విడవలేక కష్టపడేవాళ్ళు. ఈ కాలమైతే మా ఆవిడ నన్ను కొట్టిందని వదిలిపెట్టేసే పని ఆ రోజుల్లో ఏమిటి భార్య ఉండాలి భార్య ద్వితీయుడుగానే యజ్ఞం చేయాలి ఈ గృహస్థ ధర్మాలన్నీ
ఆచరించాలంటే అంటే ఇంటి యందు స్త్రీ భార్య ఉండాలి కాబట్టి ఆమెని విడవలేక ఆమె దుష్ప్రవర్తనని సహిస్తూ ఎట్ల కొట్లా నానా కష్టాలు పడుతూ శర్మ నాయన ఈమెతోటి కాలక్షేపం చేసేవాడు. ఈమెని కొంతమంది అనేవాళ్ళట ఇది నిష్టు ఒట్టి నిష్టుర కాదు ఇది కర్కస కూడాను ఎంత కఠినురాలుగా ఉన్నది ఇంత మంచి గొప్పవాడితోటి ఎంతో ప్రేమగా ఉండొచ్చు ఈమె ఇట్లాంటి దుష్ప్రవర్తన కలిగిందని ఆమెను నిష్టురని కర్కసని పిలిచేవాళ్ళు అయితే ఈ భారత పాపం బాగానే నే ఉండేవాడు అయితే ఒకనాడు ఏమైందట ఆ ఆమెకొక స్నేహితుడు ఉన్నాడు ఆయన బోళ్ళన్ని రకాల ద్రవ్యాలు నగలు వస్త్రాలు ఎన్నో పట్టుకొచ్చి ఇచ్చి ఇచ్చి ఏమన్నాట నీ భర్త ఉండటం వల్ల నువ్వు స్వతంత్రంగా ఉండలేకపోతున్నావు ఈ ప్రతిరోజు రాత్రిపూట నువ్వు హాయిగా నీ దారి నువ్వు తిరిగి పొద్దున వచ్చేసరికల్లా మళ్ళీ వీళ్ళఇంట్లో పూజ చేయాలి, వ్రతం చేయాలి హోమం చేయాలి ఇవన్నీ చేయవలసి వస్తున్నావు. ఆ ఈ భర్తని గనుక చంపేస్తివా నువ్వు ఖాళీగా ఉంటావు హాయిగా ఉంటావా ని బోధించాడు. ఆ వచ్చినవాడు వాడు ఇచ్చిన వస్తువులు తీసుకుని ఆవిడ వాడి ఇచ్చిన బోధని కూడా ఆమె తీసుకుంది. తీసుకొని ఏం చేసింది భర్త తనతోటి గడిపి రాత్రి నిద్రపోయాక బయటికి వెళ్లి ఒక బండరాత్రిని తెచ్చి ఒక దెబ్బ కొట్టి భర్త తలకాయ పగలుకొట్టేసింది. తర్వాత ఏం చేసింది ఈ భర్త శవాన్ని భుజాన వేసుకుని తీసుకుపోయి ఒక పాడుపడిన నూతిలో పడేసింది. ఆయనకి సంస్కారాలు కూడా చేయనివ్వలేదు చేయించలేదు చేయలేదు తర్వాత ఏం చేసింది ఈ విధంగా భర్తని సంహరించిన తర్వాత మంచి వయసులో ఉన్నవాళ్ళు పరస్త్రీ సంగమాభిలాష కలిగిన వాళ్ళు కామశాస్త్ర ప్రవీణులుగా ఉన్నవాళ్ళు వర్ణ సంకరక కారకులైన ఎంతో మందితోటి అనేక జాతి పురుషులతోటి స్వేచ్ఛావిహంగం లాగా ఈవిడ తిరుగుతూ ఉండేది. అయితే ఏమైంది ఎవరైనా భార్య యందో భర్త యందో అనురాగం కలిగిన ఒకళళనఒకళ్ళు బాగుండేవాళ్ళు ఉంటే ఆ
భార్యల్ని ప్రోత్సహించి, ఆడవాళ్ళని పరపురుష సంగమం చేసేలాగా ఏర్పాట్లు చేసేది. అన్ని చెత్త మంచి పనులు ఏ ఒకటి సరైన పనిలేదు. అన్ని చెత్తవే పనులు అయితే ఏకవత్నీ వ్రతం చేసిన ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఏకపత్ని వ్రతంలే వాళ్ళని చెడగొట్టేదాకా ఆమెకి ఊరుకునే గుణం ఉండేది కాదు ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారండి వీళ్ళు ఏం చేస్తారంటే తమ ఏదో దుష్ప్రవర్తన కలిగి ఉంటారు చుట్టుపక్కల తమ స్నేహితులు వాళ్ళు తమతో సరిగ్గా ఉండకపోతే వాళ్ళని కూడా తమ దారిలోకి లాకెళ్తారు. ఇంక తనను అనడానికి ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళ ముందు మధ్యలో తను ఆడ్ మ్యాన్ అవుట్ గా లేకుండా ఉండడానికి స్నేహితుల చేత కూడా ఇప్పుడు ఇది ఏ దురభ్యాసం చేసే వాడైనా పొగ తాగే వాడంతే ఇంకేదో మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళు, అంతే తాగుబోతు వాళ్ళు అంతే ఇలాగ విపరీత ప్రవర్తన కలిగిన స్త్రీ పురుషులు కూడా తమ చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని కూడా ఆ చెడు వైపుకే, తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే తమని వెలివేయటకుండా ఉండడానికి తమని అనేందుకు ఏ అవకాశము లేకుండా చేయలేదు కి స్నేహితుల్ని కూడా తము తిరిగి దిగినటువంటి పాడు నూతుల్లో, ఊబుల్లో దింపేస్తారు. అలాగే మనకి సమాజం అంతా చెడిపోయే కారణం అదే. అయితే ఈమె దయా శూన్యురాలుగా ఉండేది నిరంతరం ఆమె
పద్ధతి అదే ఇది కాకుండా దంబం చేత గాని నవ్వులాటకైనా సరదాకైనా కపటం కోసమైనా కూడా ఏనాడు దైవారాధన చేసిన పాపాన పోలేదు. ఓ హరికథ వినేది కాదు ఓ దేవాలయానికి వెళ్ళేది కాదు ఓ పూజ లేదు పునస్కారము వ్రతము, నియము ఆమె జీవితానికి మొదల ఏమీ లేవు అంతా దుష్ప్రవర్తనే అయితే ఏమైంది క్రమంగా ఎన్నాళ్ళు ఈ వేషం ఉంటుందండి యవ్వనం ఎక్కువ ఎక్కువ కాలం ఉండదు కదా యవ్వనం గడిచింది వృద్ధాప్యం వచ్చాక ఆమెకి రకరకాల వ్యాధులు పుట్టినాయి శరీరంలో ఆ పుట్టిన వ్యాధుల్లో కొన్ని కొరకాల కురుపులు వచ్చి అందులో పురుగులు తర్వాత అందులో దుర్గంధం క్రమంగా ఏమైంది. ఈమెతోటి మొదటి నుంచి స్నేహంగా ఉన్న
వాళ్ళందరూ కూడా కాస్త వృద్ధురాలైనా వస్తూ ఉండేవాళ్ళు కానీ ఆమెకు అనారోగ్యము ఆమె నుంచి తమకు జబ్బు అంటే ప్రమాదం ఏర్పడేసరికి ఇంకా ఆమెనే వదిలిపెట్టేసారు ఎవ్వరు వచ్చేవారు కాదు క్రమంగా వాళ్ళందరూ ఇచ్చిన డబ్బు నగలు అన్ని అన్నీ ఖర్చుఅయిపోయినాయి ఈ వ్యాధులతో తీసుకుని తీసుకుని తీసుకుని ఆ వ్రణాలతోటే ఆమె మరణించిందట. తర్వాత భయంకరులైన యమదూతలు వచ్చి ఈ కర్కశని పాశాలతో కట్టి యముడి వద్దకు తీసుకుపోయి ఆ యముడికి అప్ప చెప్పారు. ఆ యముడు ఈవని చూసేసరికల్లా కళ్ళేర చేసాడట, కోపంతో దీనికి భయంకరమైన ముళ్ళతో కూడినటువంటి ఇనముతో తయారు చేయబడిన స్తంభాన్ని కాల్చి, అది మండుతూ ఉండగా ఈమెతోటి ఆలింగనం చేయించండి ఈమె దాని మీదకి దొయాలి అది కావలించుకోవాల్సింది వేస్తాం స్తంభాన్ని అలాంటి శిక్ష విధించాడట. తర్వాత యముడి ఆజ్ఞ మీద యమభట్టులు ఆ కర్కసను చేసిన పాపాలు నువ్వు ఈ పని చేసావు ఆ పని చేశవు అని చెప్పి ఈ కాలుతున్న స్తంభాన్ని నువ్వు కావలించుకోవాల్సిందే ఆలింగనం చేసుకోవాలి అంటే నువ్వు హగ్ చేసుకోవాలి ఇక వేరే దారి లేదు అని చెప్పి ఇంకా ఆమెను కొట్టి చితకొట్టేవాళ్ళు ఆమె యువతలకు వచ్చేసింది కాలిపోతుంది యాతనా శరీరం ఇవతలక వస్తుంది రాంగానే యమబట్టులు ఆమెను గదలతోటి ఆ ఇనప స్తంభం మీదకి తోసేసేవాళ్ళు, తర్వాత ఏం చేశారు అక్కడి నుంచి తీసుకుపోయి కుంభిపాక నరకంలో పడేసారు మరుగుతున్న నూనెల్లో పడేశరు. ఆమెని ఎన్ని విధాలో బాధ పెట్టారు రెండు పాదాలు పట్టుకొని రాతి మీద కొట్టేవాళ్ళు ఆమెని సీసాన్ని కాచి, సీసా అంటే అది ఎట్లా ఒక రకమైన లోహం దాన్ని సీసం కాచి. రెండు చెవుల్లోన పోస్తారట ఎన్ని రకాల శిక్షలు విధించారో చివరికి ఏం చేశారు శివుడి యముడి ఆజ్ఞ మీద చిత్రగుప్తుని అనుజ్ఞ మీద యమకింకర్లు ఆమెని అనేక రకాలైనటువంటి నరక బాధలకు గురి చేశారు. ఇట్లా ఈవిడ ఈ అమ్మాయి కర్కసి అది ఒక్కటే కాదట తన పితృ పితామహులతోను తన బాంధవులతోనూ
తనకి పూర్వము 10 మంది పరము 10 మంది మొత్తం 20 తరాలతోటి తనతో కూడా 21 తరాల వారితోటి ఘోరాలైన ఈ నరకంలో మహా బాధలు పొందాక భూమిమీద పుట్టింది ఇప్పుడు చూడండి ఈ పాపం చేసిన వాళ్ళకి వాడి యొక్క యాతనా శరీరానికే బాధ కాదు ఇట్లాంటి దౌర్భాగ్యమైన పనులు చేసిన వాళ్ళ ముందు తరాల వాళ్ళు కూడా ఈ శిక్షలు పొందాలి వీళ్ళ తర్వాత వాళ్ళ వాళ్ళ వంశంలో పుట్టిన వాళ్ళు కూడా అదే శిక్షను పొందవలసి వస్తారు. అందుకనే తప్పులు చేయకూడదు అని చెప్తారు. తర్వాత ఏమైంది భూమిమీద పుట్టింది ఈ పుట్టిన తర్వాత ఇది ఎట్లా పుట్టిందట 15 సార్లు కుక్కగా జన్మించింది. అందులో 15వ జన్మల్లో ఏమైందట,కళింగ దేశంలోని ఒక బ్రాహ్మణుని వాకిట్లో కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుతూ ఉండేదట.
ఓ జనకరాజర్షి విను ఇలా ఉండగా ఒకనాడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవారం పగలంతా ఉపవాసం చేసి ఇంట్లో శివలింగాభిషేకము పూజాదులు చేసి నక్షత్ర మండలాన్ని చూసి ఇంటికి వెళ్లి దేవనివేదన చేసి బలిదానం కోసము బయటికవచ్చి బలి మీద భూమిమీద బలిని ఉంచాడు. బలిదానం అంటే ఏం చేసేవాళ్ళు ఇంట్లో వండిన వంటలో కొంత భాగాన్ని తీసుకెళ్లి దారిలో ఉంచటం అనేది ఒక విధానం ఉంది, ఉండేది. పశుపక్షాదుల కోసమే ఉంచేవాళ్ళు. తీసుకెళ్లి ఈయన ఏం చేసాడు దారిలోకి వెళ్లి రోడ్డు మీదకి వెళ్లి ఓ బలి అన్నాన్ని అక్కడ వదిలిపెట్టాడు. వదిలిపెట్టి ఏం చేసాడు పెంచాక కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి ఇంట్లోకి వెళ్తున్నాడు. వెళ్తుంటే ఈ కుక్క ఉంది కదా ఈ కర్కసే 15 సార్లు పుట్టింది ఈ 15వ సారి పుట్టినప్పుడు ఈ చుట్టుపక్కలే ఉంది అది ఏం చేసిందట పగలంతా ఆహారం లేదు దానికి సోమవారం నాడు డే అంత పగటి పూట అంతా కూడా ఉపవాసం ఉంది కృషించి కృసిించిపోయి ఉందట బకచిక్కిపోయింది కార్తీక సోమవారం నాటి సాయంకాలమున ప్రతి ప్రదోష సమయంలో ఆ బలి అన్నాన్ని భుజించిందట ఎప్పుడైతే ఈ బలి భోజనం తినేసరికి ఈ కుక్కకి పూర్వజన్మ స్మృతి కలిగింది ఇది దైవ నివేదన చేయబడినటువంటి అన్నం పైగా ఆ రోజంతా ఉపవాసం ఉంది. ఉపవాసం ఉండి రాత్రిపూట ఇల్లంతా ఇల్లు వాకిళ్లు తిరుగుతూ ఆకాశాన్ని చూసే ఉంటుంది. నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేసింది కుక్క. దానికి పూర్వజన్మ స్మృతి కలిగింది. తను ముందు జన్మలో ఏం చేశానో తన యాతనా శరీరం ఎన్ని బాధలు పడిందో తను ఎన్నిసార్లు కుక్కగా జన్మించిందో మొత్తం లైన్ అంతా ఆ వరసంతా ఆమెకి కనబడింది. కనబడేసరికల్లా గట్టిగా అరుస్తూ చెప్పిందట ఇట్లా ఓ బ్రాహ్మణోత్తమా నన్ను రక్షించు రక్షించు అన్నది అనేసరికల్లా ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణుడు. ఆయన గుమ్మ లోపలికి వెళ్తున్నాడు గబగబా బయటికి వచ్చాడు. ఈ తర్వాత అడిగాడు ఓ సునకమా మా ఇంట్లో ఏం చేశవు నువ్వు ఎందుకు రక్షించమని అడుగుతున్నావు, అంటే ఆ కుక్క ఇట్లా చెప్పిందంట బ్రాహ్మణోత్తమ విను నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణ స్త్రీని అనేక పాపాలు చేశాను కులటని వర్ణసంకరం చేశాను అన్య పురుషులతోటి గడిపి నా భర్తని స్వయంగా సంహరించాను అనేక పాపాలు చేయటం వల్ల చచ్చి యమలోకానికి వెళ్లి ఎన్నో బాధలు పడి ఇప్పటికి 15 సార్లు కుక్కగా జన్మించాను చిప్పుడు ఇప్పుడు నాకు నా జాతి స్మరణ కలిగింది నేను ఇన్ని మాటలు పుట్టానని ఇంతకుముందు చచ్చిపోయానని అంతకుముందు మనిషిగా పుట్టి చచ్చిపోయానని ఆ చనిపోకముందు నేను ఈ పాప కర్మాలన్నీ చేశానని నా యాతనా శరీరం ఏం బాధపడిందో అదంతా నాకు తెలిసిపోయింది ఆ దుఃఖాన్ని నేను సహించలేకపోతున్నా, మనం చేసిన పాపం గుర్తొస్తే దుఃఖమే, ఎందుకు చేశనా అనిపిస్తుంది అసలు నాకు గుర్తు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు నాకు ఈ జాతి స్మరణ ఎలా కలిగిందో చెప్పు నన్ను ఇందులోనుంచి రక్షించు ఈ కనబడుతున్న నా జాతిని ఆ కనబడుతున్న ఆ వరసని నేను సహించలే లేకపోతున్నానని పరి పరి విధాలుగా మొరిగి ఏడ్చిందట. అప్పుడు ఈ బ్రాహ్మణోత్తముడు ఈ మాట విని తన జ్ఞాన దృష్టితో చూసి తెలుసుకొని ఇట్లా చెప్పాడట
ఓ కుక్క ఓ సునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష సమయం వరకు భుజించకుండా ఉండి ఇప్పుడు నేను పెట్టినటువంటి ఈ బలిని భక్షించావు కాబట్టి నీకు జాతి స్మృతి కలిగింది అన్నప్పుడు ఈ కుక్క మళ్ళీ బ్రాహ్మణోత్తముని అడిగింది ఎట్లా నాకు ఈ జీవితం నుంచి విముక్తి లభిస్తుందో చెప్పు అంటే అప్పుడు ఆయన ఏం చేసాడంట ఈ బ్రాహ్మణుడు పరోపకార బుద్ధితోటి కార్తీక సోమవారాల యందు తను చేసిన పుణ్యంలో ఒక్క సోమవార వ్రత పుణ్యాన్ని, ఈ కుక్క పేరు చెప్పి దానికి దానం చేశాడు ధారపోసాడట ఎప్పుడైతే ఇక సోమవార పుణ్యం తనకి లభించిందో ఈ కుక్క తన శరీరాన్ని విడిచి ప్రకాశిస్తున్నటువంటి అద్భుతమైన దైవ శరీరం కలదై ప్రకాశించేటి వస్త్రాలు మాల్యాలు అంటే దండలు పువ్వుల దండలు ధరించి ఆభరణాలంకృతయే తన పితరులతో కూడా కైలాసానికి పోయింది కుక్కకు ఒకదానికే మోక్షం రాలా ఆమె వల్ల యాతనా శరీరంతో యమబాధలు పడుతున్నటువంటి ఆమె పితరులు ఆమెపది ముందు తరాలుప తర్వాత తరాల వారు కూడా ఆ విమానం ఎక్కి కైలాసానికి వెళ్ళిపోయి అక్కడ పార్వతీదేవి శివునితో కూడా ఎంత ఆనందిస్తుందో ఈ కర్కస కూడా అంత ఆనందాన్ని పొందిందట కాబట్టి కార్తీక మాసమందు సోమవార వ్రతము ఆచరింపతగినది ఎవడు కార్తీక సోమవార వ్రతాన్ని చేస్తాడో వాడి మోక్షం వాడి చేతిలో ఉన్నట్టేనట కాబట్టి
ఓజన జనక మహారాజా పుణ్యప్రదమైన కార్తీక వ్రతాన్ని నీవు ఆచరించమని వశిష్ట మహాముని రాజర్షికి బోధించారు. దీంతో రెండో రోజు పారాయణ పూర్తి చేసుకున్నాము.
Also read :కార్తీక పురాణం





