Rudrashtakam in Telugu Lyrics
రుద్రాష్టకం ప్రముఖ భక్త కవి గోస్వామి తులసీదాస్ గారు రచించిన ఒక ప్రసిద్ధ స్తోత్రం. ఇది ఆయన రచించిన మహాకావ్యం రామచరితమానస్ లోని ఉత్తర కాండం లో ఉంది. ఈ స్తోత్రం శివుడి రూపమైన రుద్రుడిని స్తుతిస్తూ రాసారు . ‘రుద్రుడు’ అంటే శివుడి కోపభరితమైన లేదా భయంకరమైన రూపం అయినప్పటికీ, ఈ స్తోత్రంలో ఆయన కరుణామయ మరియు సర్వోన్నత స్వరూపాన్ని కీర్తించారు.
‘రుద్రాష్టకం’ అనే పదం ‘రుద్ర’ మరియు ‘అష్టకం’ అనే రెండు పదాల సమ్మేళనం. ‘అష్టకం’ అంటే ఎనిమిది శ్లోకాలతో కూడిన కూర్పు. అందువల్ల, రుద్రాష్టకంలో ఎనిమిది ప్రధాన శ్లోకాలు మరియు ఒక ఫలశ్రుతి (పఠన ఫలితం) భాగం ఉంటుంది.
ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. భక్తి భావంతో రుద్రాష్టకాన్ని పారాయణం చేసే వారిపై పరమేశ్వరుడైన శివుడు దయతో కటాక్షిస్తాడని నమ్మకం ఉంది. ఇది కష్టాలు, బాధలు, దుఃఖాలను తొలగించి, జీవితంలో శాంతి, సుఖం, సంతోషం కలుగజేస్తుంది. అదేవిధంగా, రుద్రాష్టక పఠనం జ్ఞానం, ఆధ్యాత్మిక పురోగతి, మరియు మోక్షం పొందడంలో సహాయపడుతుంది.
పురాణాల ప్రకారం, శ్రీరాముడు రావణుడిపై యుద్ధానికి ముందుగా శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం రుద్రాష్టకాన్ని పఠించినట్లు ప్రతీతి ఉంది. అందువల్ల, ఈ స్తోత్రం శివభక్తులకు మాత్రమే కాక, ఆధ్యాత్మిక సాధకులకు కూడా మహత్తర ప్రేరణగా నిలుస్తుంది.
రుద్రాష్టకం
నమామీశ మీశాన నిర్వాణ రూపం
విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం |
అజం నిర్గుణం నిర్వి కల్పం నిరీగం
చిదాకార మాకాశ వాసం భజేహం || 1 ||
నిరాకార ఓంకార మూలం పురీయం
గిరాజ్ఞాన గోతీ గభీశం గిరీశం |
కరాళం మహాకాల కాలం కృపాలం
గుణాకార సంసార సారం నఘోహం || 2 ||
ఉషారాగ్ని సంకాశ గౌరం గభీరం
మనో భూత కోటి ప్రభాశీష హీరం |
స్పురన్ మౌళి కల్లోలిని చారు గంగ
రసత్ బాల బాలేందు కంఠే భుజంగ || 3 ||
జలత్ కుండలం శుభ్ర నేత్రం విశాలం
ప్రసన్ననానం నీలకంఠం దయాలం |
మృగాదీశ చర్మాబరం ముండ మారం
ప్రియం శంఖరం సర్వ నాదం భజానం || 4 ||
ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం
అఖండం భజే భాను కోటి ప్రకాశం |
త్రైశూల నిర్మూలనం శూల పాణిం
భజేహం భవానీ పతిం భావ గమ్యం || 5 ||
కలాతీత కళ్యాణ కల్పాంత కారిః
సదా సజ్జనానంద దాతా పురారిః |
చిదానంద సందోహ మో హాపహారి
ప్రసీద ప్రసీద ప్రభో మన్మదారిః || 6 ||
నయావత్ ఉమానాద పాదార విందం
భజంతి హలోకే పరే వాన హారం |
గతావత్ సుఖం వాపి సంతాప నాశం
ప్రసీద ప్రభో సర్వ భూతాది వాసా || 7 ||
నజానామి దోతం జపం దైవ పూజాం
నతోహం సదా సర్వ దాదేవ తుభ్యం |
జరా జన్మ దుఃఖౌ గతా తప్య మానం
ప్రభో పార్ధి శాపాన మామీశ శంభో || 8 ||
రుద్రాష్టక మిదం ప్రోక్తం విప్రేణ హర తుష్టయే
యే పఠంతి నరా భత్యా తేషాం శంభుః ప్రసీదతీ
ఇతి శ్రీ రుద్రాష్టకం |
ఇంకా ఈ స్త్రోత్రాలు చదవండి : త్రిముఖి రుద్రాక్ష





